దీన్ని ఎలా తయారు చేయాలంటే... ఒక పాన్ తీసుకుని, దీంట్లో ఎండు మిరపకాయలు వేసి.. గలగలలాడే వరకు వేయించాలి. ఆ తరువాత, బ్లెండర్ లో వేయించిన ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఉప్పు, పంచదార వేసి బరుకుగా మిక్సీ చేసుకోవాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గాజు జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి సిచువాన్ మిరియాలు, సోంపు, సోయా సాస్ కలపాలి. ఏదైనా వంట నూనెను దీనికి కలపాలి. ముఖ్యంగా వేడి నువ్వుల నూనె అయితే చాలా బెటర్. ఈ నూనెను వేసి బాగా కలిపి, గట్టిగా మూత బిగించాలి.