రెగ్యులర్ శృంగారంతో ఎన్ని లాభాలో తెలుసా?

First Published Sep 17, 2021, 4:17 PM IST

రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే వారు తమ శరీరం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. శరీరాకృతి, ఆరోగ్యం సరిగా లేకపోతే శృంగారంలో పీక్స్ ను చేరుకోలేమని ఆందోళన చెందుతారు. అందుకే ఫిట్ నెస్ మీద దృష్టి పెడతారు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. 

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. సెక్స్ వల్ల ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయి అదుపులో ఉంచడానికి దోహదపడుతుంది. ఈ హార్మోన్లు సమతుల్యతలో లేనప్పుడు, గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధులు అటాక్ చేస్తాయి. అందుకే గుండెజబ్బులు ఎక్కువగా రాకుండా ఉండాలంటే రెగ్యులర్ గా శృంగారం చేయడం తప్పనిసరి. 

ఇది మీ శరీరం గురించి మీరు పట్టించుకునేలా చేస్తుంది. రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే వారు తమ శరీరం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. శరీరాకృతి, ఆరోగ్యం సరిగా లేకపోతే శృంగారంలో పీక్స్ ను చేరుకోలేమని ఆందోళన చెందుతారు. అందుకే ఫిట్ నెస్ మీద దృష్టి పెడతారు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. 

మంచి నిద్రకు చక్కటి మార్గం.. శృంగారం తరువాత శరీరం మొత్తం ఉత్తేజితమై.. కండరాలు, నరాలు బాగా యాక్టివేట్ అవ్వడంతో కాస్త అలిసిపోయినట్టుగా అవుతారు. దీనివల్ల చక్కటి నిద్రకు దారి తీస్తాయి. దీంతో మీలో నిద్రలేమి తగ్గిపోతుంది. 

శృంగారం ఆహ్లాదకరమైనదే.. అనుమానం లేదు.. దాంతో ఒత్తిడి తగ్గుతుందని చాలామందికి తెలుసు.. రోజువారీ పని ఒత్తిడి, ఆందోళన తగ్గి రిలాక్స్ అవుతారు. అయితే కేవలం ఇవ్వే కాదు క్రమం తప్పకుండా శృంగారం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.  

రోగనిరోధక శక్తిని మెరుగుపడుతుంది.. సూక్ష్మక్రిములు, వైరస్ లాంటి వ్యాధికారకాలు శరీరంలో ప్రవేశించకుండా శరీరం నిరోధకతను ఏర్పరచుకుంటుంది. దీనిమీద పరిశోధనలు చేసిన పెన్సిల్వేనియా రీసెర్చర్లు ఈ విషయాన్ని కనిపెట్టారు. వీరు తక్కువ సార్లు శృంగారంలో పాల్గొన్నవారితో పోల్చితే వారానికి ఒకటి, రెండు సార్లు శృంగారం చేసిన కాలేజీ విద్యార్థుల్లో ఓ నిర్దిష్ట యాంటీబాడీ ఎక్కువగా ఉన్నట్టు తేలింది. 

మహిళల్లో మూత్రాశయం నియంత్రణ  మెరుగుపడుతుంది... రెగ్యులర్ గా ఆర్గాజమ్స్  ఉండడం వల్ల మహిళల్లో కటి ప్రాంతంలోని కండరాల పనితీరు బాగుంటుంది. కండరాలు బలోపేతం అయ్యేలా టోన్ చేస్తుంది. కటి కండరాల బలోపేతం కోసం చేసే కెగెల్ వ్యాయామాలలాంటి ప్రయోజనాలు రెగ్యులర్ సెక్స్ వల్ల కలుగుతాయి. కటి కండరాలు ధృఢంగా ఉండడం వల్ల మూత్రం పడిపోకుండా నియంత్రించుకోగలిగే సామర్థ్యం మెరుగు పడుతుంది. 

మనిషి సంఘజీవి. స్నేహితులు, కుటుంబం, పరిచయస్తులతో మీరు ప్రవర్తించే తీరు మిమ్మల్ని మంచివాడిగానో చెడ్డవాడిగానో మార్చేస్తుంది. అయితే క్రమం తప్పని శృంగారం మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచి.. మీ సామాజిక సంబంధాల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. 

శృంగారం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సెక్స్ లో మీకేం కావాలో మొహమాటం లేకుండా చెప్పగలుగుతారు. ఇది మిమ్మల్ని మరింత పవర్ ఫుల్ ఇండివిడ్యువల్ గా మార్చేస్తుంది. పడకగదిలో ఎదుటి వాళ్లు ఏదో చేయాలని మీరు వేచి ఉండక్కరలేదు. మీరే నేరుగా ముందడుగు వేయచ్చు. 

click me!