బట్టతలా?... ఈ వంటింటి చిట్కాలతో చెక్ పెట్టండి...

First Published Sep 17, 2021, 3:35 PM IST

జుట్టురాలడం మామూలే. అయితే అది తీవ్రమై బట్టతలకు దారి తీస్తేనే సమస్య మొదలవుతుంది. బట్టతల వల్ల ఆత్మవిశ్వాస లోపం, మానసిక ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు మొదలవుతాయి. 

అందమైన తలకట్టు ఆడవాళ్లకే కాదు మగవాళ్లకూ అందాన్ని పెంచుతుంది. చక్కటి క్రాఫ్ లేదా హెయిర్ స్టయిల్.. యంగ్ గా, హ్యాండ్ సమ్ గా కనిపించేలా చేస్తుంది. అయితే జుట్టు రాలిపోవడం అనే సమస్య అందానికి పెద్ద చెక్ పెడుతుంది. జుట్టురాలడంతో ఆగిపోకుండా ఇది బట్టతలకు దారితీస్తేనే అసలు సమస్య మొదలవుతుంది. 

జుట్టురాలడం మామూలే. అయితే అది తీవ్రమై బట్టతలకు దారి తీస్తేనే సమస్య మొదలవుతుంది. బట్టతల వల్ల ఆత్మవిశ్వాస లోపం, మానసిక ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు మొదలవుతాయి. 

నీట్ క్రాఫింగ్, చక్కటి బాడీషేప్ ఉండాలని అందరూ ఆలోచిస్తారు. అందుకే అందంగా కనిపించాలని..అందరూ కోరుకుంటారు. అయితే కొంతమందిలో ఈ జుట్టురాలే సమస్య తీవ్రమై ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే చింతించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. 

జుట్టురాలిపోతుంటే డిప్రెషన్ గా అనిపిస్తుంది. అయితే బట్టతలను నివారించవచ్చు. కొంతవరకు దాన్ని పెరగకుండా ఆపొచ్చు. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదంటున్నారు  నిపుణులు. 

బట్టతలను నివారించడానికి వందలకొద్ది వంటింటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని ఆపేసి, బట్టతల రాకుండా నివారిస్తాయి. అందులో కొన్ని చాల ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవి కొన్ని మీ కోసం...

ఆయిల్ మసాజ్ : జుట్టును క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫాలికిల్స్ ఉత్తేజితం అవుతాయి. ఇవి జుట్టు రాలడాన్ని ఆపేసి, కొత్త వెంట్రుకలు మొలిచేలా చేస్తాయి. తద్వారా హెయిర్ ఫాల్ కానీ బాల్డ్ హెయిర్ కానీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 

అలోవెరా.. జుట్టు సమస్య ఏదైనా తగ్గించే అతి సులభమైన మార్గం. అలోవెరా ఒక ఆకును తీసుకుని.. దాన్లోని గుజ్జును తీసి, మాడుకు పట్టించడమే. గంట తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యల్ని అధిగమించవచ్చు. 

ఫిష్ ఆయిల్ : జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు అవసరమైన ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ ఫిష్ ఆయిల్ లో ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని ఇష్టమొచ్చినట్టు వాడడానికి లేదు. ఈ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ వాడేముందు తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాల్సిందే. 

ఉల్లిపాయ రసం జుట్టుకు పెట్టుకోవడం వల్ల కూడా జుట్టు రాలడాన్ని, బట్టతలను అరికట్టవచ్చు. అయితే ఇది కొంచెం అతుక్కున్నట్టుగా, జిడ్డుగా ఉంటుంది. ఇది బట్టతలకు కారణమయ్యే అలోప్సియా అరెటేకు చికిత్స గా పనిచేసి.. జుట్టు రాలడాన్ని ప్రాథమిక దశలోనే అరికడుతుంది. 

కొబ్బరినూనెలో తాజా నిమ్మరసాన్ని కలిసి తలకు పట్టిస్తే... మీ జుట్టుకు అద్భుతాలు చేస్తుంది. కొబ్బరినూనెలోని సహజసిద్ధమైన సుగుణాలు, నిమ్మలోని సిట్రల్ లక్షణాలు కలిసి జుట్టును రెమెడీగా పనిచేస్తాయి. 

click me!