Sugar: నెల రోజులు పంచదార తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ముఖంలో ఎలాంటి మార్పులు వస్తాయి?

Published : Sep 30, 2026, 06:26 PM IST

Sugar: పంచదార ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం మనకు తెలిసినా కూడా ఏదో ఒక రూపంలో షుగర్ తీసుకుంటూనే ఉంటాం. మరి, ఈ షుగర్ ని నెల రోజులపాటు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ఎలాంటి మార్పులు వస్తాయి?

PREV
13
షుగర్ మానేస్తే ఏం జరుగుతుంది?

ప్రతిరోజూ మనం ఉదయం తీసుకునే టీ, కాఫీ నుంచి రాత్రి తినే స్వీట్లు, కూల్ డ్రింక్స్ , ప్యాకెట్ ఫుడ్స్ వరకు ప్రతి దాంట్లోనూ పంచదార ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన శరీరంలోకి వెళ్తూనే ఉంది. అయితే, రుచిగా ఉండే ఈ తీపి పదార్థం మన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుందనే విషయం చాలా మందికి ఆలస్యంగా అర్థమవుతుంది.

ఒకవేళ మీరు ఈరోజు నుంచి సరిగ్గా నెల రోజుల పాటు పంచదార ముట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుంటే ఏమవుతుంది? మొదటి రెండు, మూడు రోజులు మన శరీరం, మెదడు ఆ తీపి కోసం విపరీతంగా అల్లాడిపోవడం ఖాయం. కానీ, ఆ చిన్న కష్టాన్ని తట్టుకుని ఆ గడువును పూర్తి చేస్తే... మీ శరీరం లోపల ఊహించని అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయి. మరి, నెల రోజులు షుగర్ కి దూరంగా ఉంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం..

23
చర్మంలో వచ్చే ప్రధాన మార్పులు..

షుగర్ తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి, చర్మంలో నూనె ఉత్పత్తి ఎక్కువవుతుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. అదే.. షుగర్ మానేస్తే... ఈ మొటిమలు తగ్గడమే కాదు, కొత్తవి కూడా రావు. మనం తీసుకునే చక్కెర వల్ల 'గ్లైకేషన్' అనే ప్రక్రియ జరుగుతుంది.

ఇది చర్మంలోని కొల్లాజెన్ , ఎలాస్టిన్ కణాలను దెబ్బతీసి, ముడతలు పడేలా చేసి త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేలా చేస్తుంది. కానీ, షుగర్ మానేయడం వల్ల ఈ కొల్లాజెన్ కణాలు రక్షించగలం, చర్మం బిగువుగా, కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా, చర్మం నిస్తేజంగా మారడానికి కారణమయ్యే షుగర్ కంటెంట్ తగ్గడం వల్ల ముఖం సహజమైన మెరుపును, తాజాదనాన్ని సంతరించుకుంటుంది. కంటి కింద నలుపు కూడా తగ్గుతుంది.

33
శరీరం , ఆరోగ్యంలో వచ్చే ఇతర మార్పులు..

చర్మ సౌందర్యంతో పాటు మన శరీరం, ఆరోగ్యంలోనూ విప్లవాత్మక మార్పులు వస్తాయి. షుగర్ ని పూర్తిగా ఆపేయడం ద్వారా అదనపు కేలరీలు , కొవ్వు కరిగి శరీర బరువు సులభంగా తగ్గుతారు. సాధారణంగా షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే సడన్ ఎనర్జీ క్రాప్స్ తగ్గి, రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండగలుగుతారు. అలాగే కడుపులోని మంచి బ్యాక్టీరియా మెరుగ్గా పనిచేసి జీర్ణక్రియ మెరుగుపడుతుంది, దీనివల్ల అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories