మీరు 1 నెల మందు తాగడం మానేస్తే, మీ నిద్ర మెరుగుపడటమే కాకుండా, మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. నిజానికి, మీరు మద్యం సేవిస్తే, అది మీ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది ఆందోళన , విచారం భావాలను కలిగిస్తుంది. మద్యపానాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక వ్యక్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. అలాగే అతని జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.