బ్యూటీ విత్ బ్రెయిన్: కావ్య మారన్ బ్యాగ్రౌండ్ తెలుసా?

First Published | Aug 14, 2024, 11:02 AM IST

కావ్య మారన్‌.. ఈ పేరు తమిళనాట పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియాలో మారుమోగిన పేరు.  ప్రస్తుతం హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ సహ యజమానిగా ఉన్న కావ్య మారన్‌ తమిళనాడులోని సన్‌ టీవీ నెట్‌వర్క్‌కు వారసురాలు. రాజకీయ బ్యాగ్రౌండ్‌ ఉన్న ఆమె ఇప్పటికే విజయవంతమైన వ్యాపార వేత్తగా పేరుపొందారు. 
 

సన్‌రైజర్స్‌ టీంకు కో ఓనర్‌గా ఉన్న కావ్య మారన్‌.. కళానిధి మారన్‌, కావేరి కళానిధి దంపతుల కుమార్తె. ఆమె 1992 ఆగస్టు 6న పుట్టారు. ఆమె తల్లి కావేరీ మారన్‌ సోలార్‌ టీవీ కమ్యూనికేషన్‌ సీఈఓగా ఉన్నారు. ఇండియాలో అత్యధిక వేతనం తీసుకుంటున్న మహిళల్లో కావేరీ మారన్‌ ఒకరు కావడం విశేషం. 
 

ఫ్యామిలీ వివరాలు..

కావ్య మారన్‌ తండ్రి కళానిధి మారన్‌ దివంగత మాజే డీఎంకే అధినేత కరుణానిధి మనవడు. కావ్య మారన్‌ తన తండ్రి స్థాపించిన సన్ గ్రూప్‌లో చేరి వ్యాపారాన్ని విస్తృతం చేశారు. ఆసియాలోని అతిపెద్ద మీడియా నెట్‌వర్క్‌లలో సన్‌ గ్రూప్‌ ఒకటిగా నిలిచింది. 
 


కావ్య మారన్‌ ఎడ్యుకేషన్‌..

కావ్య మారన్‌ చెన్నైలోని స్టెల్లా మేరీస్‌ కాలేజీ నుంచి కామర్స్‌ డిగ్రీ పట్టా పొందారు.  వ్యాపార రంగంలో రాణించేందుకు వీలుగా యూకే వెళ్లి, వార్విక్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ చదివారు.  ప్రస్తుతం సన్‌ నెట్‌వర్క్‌ వ్యాపార కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. 
 

కావ్య మారన్‌ నికర ఆదాయం విలువ ఎంతో తెలుసా..

కావ్య మారన్‌ తండ్రి కళానిధి మారన్‌ ఇండియాలోనే టాప్‌ రిచ్చస్ట్‌ పర్సన్స్‌లో ఒకరు. ఆయన నికర ఆస్తులు, ఆదాయం విలువ సుమారు రూ.19000 కోట్లు కాగా, కావ్య మారన్‌ నికర ఆదాయం దాదాపు రూ.409 కోట్లు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టకు సహ యజమానిగా ఉన్నారు. 2018 నుంచి సన్‌రైజర్స్‌ టీమ్‌ను నిర్వహిస్తున్నారు. 
 

Latest Videos

click me!