పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Jun 16, 2024, 10:44 AM IST

ప్రతి ఒక్క వంట, కూరల్లో మనం ఉల్లిపాయను ఖచ్చితంగా వేస్తుంటాం. అలాగే కొన్ని ఫుడ్స్ లో ఉల్లిపాయల్ని పచ్చిగానే తింటుంటారు. కొంతమంది మాత్రం వీటిని తింటే నోట్లో నుంచి దుర్వాసన వస్తుందని తినకుండా ఉంటారు. కానీ పచ్చి ఉల్లిపాయలను తింటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 
 

ఇండియన్ ఫుడ్ లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో ఉల్లిపాయ ఒకటి. చాలా మంది ఉల్లిపాయను వండిన తర్వాతే తింటుంటారు. పచ్చిగా తినే వారు చాలా తక్కువే. ఎందుకంటే పచ్చిఉల్లి తింటే నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది. అందుకే చాలా మంది పచ్చిఉల్లిపాయను తినడం. కానీ పచ్చి ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది డయాబెటిస్ లేదా దీని ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

క్యాన్సర్ నుంచి రక్షణ

పచ్చి ఉల్లిపాయల్లో ఉన్న కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే పచ్చి ఉల్లిపాయ కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

మెరుగైన జీర్ణక్రియ

పచ్చి ఉల్లిపాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే మన గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Latest Videos


బలమైన రోగనిరోధక శక్తి

పచ్చి ఉల్లిపాయల్లో మంచి మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బాగా సహాయపడుతుంది. దీంతో మీరు ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటే వ్యాధులు తొందరగా తగ్గిపోతాయి. 

ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం 

ఎవరికైనా కీళ్లనొప్పుల సమస్య ఉంటే పచ్చి ఉల్లిపాయలు వారికి ఎంతో ఉపయోగపడతాయి. అవును పచ్చి ఉల్లిపాయల్లో ఉండే సమ్మేళనం శోథ నిరోధక లక్షణాలను కలిగి  ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. 

గుండె ఆరోగ్యం 

పచ్చి ఉల్లిపాయను మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల  అధిక రక్తపోటు నియంత్రిణలో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

పోషకాల సమృద్ధి

పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి.

click me!