రాత్రిపూట పాదాలకు ఆవనూనె రాస్తే ఏమౌతుంది..?

First Published | Sep 23, 2024, 9:38 AM IST

మనం ఆవనూనెను  కాస్త గోరువెచ్చగా చేసి.. రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయాలట. అలా రెగ్యులర్ గా చేయడం వల్ల మన బాడీకి కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేద్దాం...

foot massage

ఆముదం అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడంటే.. తలకు కొబ్బరి నూనె రాస్తున్నారు.. లేదంటే.. బాదం నూనె, రోజ్ మేరీ ఆయిల్.. ఇలా రకరకాల నూనెలు జుట్టుకు అప్లై చేస్తూ ఉంటారు.  కానీ.. పూర్వం దాదాపు అందరూ తలకు నూనె అంటే ఆముదం మాత్రమే రాసేవారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఆముదాన్ని మాత్రమే వాడేవారు. కేవలం జుట్టుకు మాత్రమే కాదు... పిల్లల అరుగుదల సమస్య తగ్గడానికి ఆముదం తాగించేవారు.. పొట్టకు, బాడీకి కూడా ఆముదంతోనే మసాజ్ చేసేవారు.  ఆవ నూనెను మాత్రం వంటల్లో భాగం చేసుకునేవారు. ఎక్కువగా పచ్చళ్లు నిల్వ ఉంచడానికి ఆవనూనె వాడేవారు. మరి.. ఇదే ఆవనూనె మనకు ఊహించని ప్రయోజనాలు ఇస్తుందని మీకు తెలుసా?. మనం ఆవనూనెను  కాస్త గోరువెచ్చగా చేసి.. రాత్రి పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయాలట. అలా రెగ్యులర్ గా చేయడం వల్ల మన బాడీకి కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేద్దాం...


రెగ్యులర్ గా మనం ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఉంటాం. తలకు ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల మనకు ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది.మంచి నిద్ర కూడా వస్తుంది. మరి..  అరికాళ్లకు ఆవ నూనె రాయడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయట.



ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కీళ్లనొప్పులు, ముఖ్యంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అలాంటివారు.. కనుక రాత్రిపూట గోరువెచ్చని ఆవనూనె పాదాలకు మంచిగా మసాజ్ చేయాలట. ఇలా రోజూ చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందట. అంతేకాదు.. ఇంటి పని, ఆఫీసు పని తో ఒత్తిడికి బాగా గురౌతున్నారు.  అలాంటివాళ్లు.. రాత్రిపూట ఈ ఆవనూనె పాదాలకు మసాజ్ చేస్తే చాలట. ఇలా చేయడం వల్ల అలసట దూరమై, ఒత్తిడి తగ్గి.. మంచి నిద్ర సొంతమౌతుందట. రాత్రిపూట నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడేవారు.. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది బెస్ట్ రెమిడీ అని చెప్పొచ్చు.

అంతేకాదు... ఈ ఆవనూనె మీ బరువు కూడా తగ్గిస్తుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, ప్రతిరోజూ రాత్రి గోరువెచ్చని ఆవాల నూనెతో మీ పాదాల అరికాళ్ళకు మసాజ్ చేయండి. కనీసం వరసగా నెల రోజులు ఇలా ప్రయత్నించి చూడండి.. మీ బరువులో కచ్చితంగా తేడా మీకు స్పష్టంగా కనపడుతుంది.
 


అంతేకాదు... మహిళలకు ప్రతి నెలా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఆ పీరియడ్స్ సమయంలో ఎంత నొప్పి ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నొప్పిని, పీరియడ్స్ తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగించడంలో... ఈ ఆవనూనె బ్రహ్మాండంగా పని చేస్తుంది.  కేవలం.. ఆవనూనెతో మసాజ్ చేస్తే సరిపోతుంది. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి , తిమ్మిరి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది PMS వల్ల వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం కూడా ఆవనూనెను ఔషధాల గనిగా పరిగణిస్తసారు. ఈ నూనెతో మనం పాదాలకు మాత్రమే కాదు... శరీరానికి మసాజ్ చేయడం వల్ల.. బాడీకి రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. రక్త ప్రసరణ మంచిగా జరిగితే.. ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది.

మీకు తరచుగా తలనొప్పి ఉంటే, ప్రతి రాత్రి 5 నిమిషాలు మీ అరికాళ్ళకు మసాజ్ చేయండి. మీరు కొన్ని వారాల్లో తేడాను అనుభవించవచ్చు.
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీరు కావాలంటే.. ముఖంపై కూడా ఆవనూనెతో మసాజ్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల   ముఖంలోని మచ్చలను తొలగిస్తుంది. చర్మంపై మెరుపును తెస్తుంది.
 

Latest Videos

click me!