తలనొప్పిని తరిమికొట్టాలా? ఈ పానీయాలు ట్రై చేయండి...

First Published Sep 18, 2021, 3:49 PM IST

తలనొప్పి నుంచి ఉపశమనం లేదా? ఇంటి చిట్కాలేమీ లేవా? ఎలా తగ్గించాలి? అంటే.. ఉన్నాయి.. సులువుగా ఇంట్లోనే.. చక్కటి, రుచికరమైన, హెల్తీ టిప్స్ ఉన్నాయి. వీటితో తలనొప్పి తగ్గడమే కాదు.. పూర్తి శరీరం ఉత్సాహంగా, ఉల్లాసంగా  తయారవుతుంది. కొన్ని రకాల హెర్బల్ టీలతో ఈ తలనొప్పికి ఎంచక్కా టాటా చెప్పొచ్చు.. 

తలనొప్పి... దీన్నిమించిన నరకం ఉండదు. నెత్తిమీద సుత్తితో కొట్టినట్టు పోట్లు.. తల లోపల ఏదో బ్యాండ్ మేళం వాయిస్తున్నట్టు.. రికార్డింగ్ డ్యాన్స్ పెట్టినట్టు.. ఒకటే గందరగోళం.. దీనికోసం పెయిన్ బామ్స్ డబ్బాలు ఖాళీ చేస్తాం.. పదే పదే టాబ్లెట్లు వేసుకుంటాం.. కాసేపు ప్రశాంతంగా కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటాం.. జోరీగల్లాంటి ఆలోచనల్ని పక్కకు నెడతాం.. అయినా అవన్నీ పైపైన ఉపశమనంగానే ఉంటాయి.

తలనొప్పి నుంచి ఉపశమనం లేదా? ఇంటి చిట్కాలేమీ లేవా? ఎలా తగ్గించాలి? అంటే.. ఉన్నాయి.. సులువుగా ఇంట్లోనే.. చక్కటి, రుచికరమైన, హెల్తీ టిప్స్ ఉన్నాయి. వీటితో తలనొప్పి తగ్గడమే కాదు.. పూర్తి శరీరం ఉత్సాహంగా, ఉల్లాసంగా  తయారవుతుంది. కొన్ని రకాల హెర్బల్ టీలతో ఈ తలనొప్పికి ఎంచక్కా టాటా చెప్పొచ్చు.. అవేంటో చూసి.. మీరూ ట్రై చేయండి..  

సడెన్ గా వచ్చే తలనొప్పి తగ్గించే అద్భుతమైన పానీయం నిమ్మరసం. హ్యంగోవర్ లో వచ్చే తలనొప్పిని చిటికెలో మాయం చేస్తుంది. దీంతో పాటు అన్ని రకాల తలనొప్పులనూ ఎంతో అద్భుతంగా తగ్గిస్తుంది. దీనికోసం నీటిని మొదట మరిగించాలి. ఈ నీటిలో ఒక పూర్తి నిమ్మకాయ లేదా సగం నిమ్మకాయ ముక్క రసం పిండాలి. దీన్ని కాస్త గోరువెచ్చగానే తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరంలో విషపదార్థాలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. జీర్ణక్రియ సంబంధ సమస్యలనూ తగ్గిస్తుంది. 

పుదీనా టీ
పుదీనా లోని ఘాటైన వాసన, ఔషధ గుణాలు మెదడులో పట్టేసిన నరాలకు రిలీఫ్ నిస్తాయి. దీనివల్ల నొప్పికి కారణమైన కండరాల్లో కదలిక వస్తుంది. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తలనొప్పే కాదు పుదీనా టీ వల్ల కడుపులోని అసౌకర్యం కూడా తగ్గుతుంది. కడుపును హెల్తీగా ఉంచడానికి కూడా ఈ పుదీనా టీ బాగా పనిచేస్తుంది. ఇది కూడా అంతే.. వేడి నీళ్లలో పుదీనా ఆకులు వేసి.. కాసేపు పక్కన పెట్టి ఆ తరువాత వడకట్టి ఒక చెంచా హనీతో తాగేయడమే.

ఫీవర్ ఫ్యూ టీ : ఫీవర్ ఫ్యూ ను మెడివల్ ఆస్ప్రిన్ అని కూడా పిలుస్తారు. దీనికున్న ఔషధ తత్వాల వల్ల దానికీ పేరు వచ్చింది. మైగ్రేన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ నివారణోపాయం మైగ్రేన్ కు చక్కటి తారకమంత్రంలా పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడం చాలా ఈజీ. కొన్ని ఫీవర్ ఫ్యూ ఆకులు తీసుకుని వేడి నీళ్లలో వేసి కాసేపు అలాగే పక్కన పెట్టేయాలి. ఆ తరువాత దీనికి పాలు కలుపుకుని తాగొచ్చు. లేదంటే ఈ వేడి నీటిని వడకట్టి కాస్త ఒక స్పూన్ హనీ కలిపి తీసుకోవచ్చు. 

అల్లం ఛాయ్ : తలనొప్పిని తగ్గించే మరో అద్భుతపానీయం అల్లం టీ. ఇది రక్తనాళాలను ఉత్తేజితం చేసి మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది. దీంతో తలనొప్పి చిటికెలో మాయమవుతుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభం.. రెండు కప్పుల నీటిలో, ఒక అంగుళం అల్లం ముక్క చిన్న ముక్కలుగ చేసి వేయాలి. ఈ నీటిని మరిగించి, వడకట్టి స్పూన్ తేనె కలిపి తాగాలి. దీనివల్ల తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనంగానే కాకుండా శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మెదడును ఉత్తేజితం చేసే సహజగుణం అల్లంలో ఉంటుంది. 

పిప్పర్ మింట్ టీ : పిప్పర్ మెంట్ గాఢమైన వాసన, దీన్లోని ఔషధ గుణాలు, కండరాల దృఢత్వాన్ని తగ్గించడంలో సాయపడతాయి. నరాలకు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. సడెన్ గా వచ్చే తలనొప్పులకు ఈ టీ ఎంతో చక్కగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ పిప్పర్ మింట్ టీ కడుపు ఆరోగ్యాన్ని బాగుచేసి, అసౌకర్యాన్ని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. 

click me!