యోగా చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా?

First Published | Jun 12, 2024, 4:03 PM IST

ప్రతిరోజూ యోగాసనాలు చేయడం వల్ల మన శరీరానికే కాదు మనస్సుకు కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే చాలా మంది క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు. అసలు యోగాతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే? 

యోగాసనాలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ఎంతో బిజీగా ఉండే సెలబ్రిటీలు సైతం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రెగ్యులర్ గా యోగసనాలు చేస్తుంటారు. యోగా మన ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే యాంగ్జైటీని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. యోగాసనాలు మన శరీరాన్ని బలంగా చేస్తాయి. అలాగే మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. యోగాసనాల వల్ల మన శరీరానికి , మనస్సుకు ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

యోగా ప్రయోజనాలు

యోగా కండరాల వశ్యతను మెరుగుపరుస్తుంది.
శరీరం భంగిమను సరిచేస్తుంది. 
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 
యోగా చేయడం వల్ల అంతర్గత అవయవాలు బలోపేతం అవుతాయి. 
ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది. 
డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. 
 

Latest Videos


గుండెకు సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది
చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. 
శరీర బలాన్ని, స్టామినాను పెంచుతుంది. 
యోగా ఏకాగ్రతను పెంచుతుంది. 

యోగా మనస్సును, ఆలోచనలను నియంత్రించడానికి సహాయపడుతుంది
స్ట్రెస్, యాంగ్జైటీ, నిరాశను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.
రక్త ప్రసరణను పెంచుతుంది. 
చెమట ఉత్పత్తిని పెంచుతుంది. 
గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. 
 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆరోగ్యంగా ఉండటానికి యోగా బాగా సహాయపడుతుంది. చాలా వ్యాధులు యోగాతో కాస్త తగ్గుతాయి. యోగాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే?అల్లోపతిలో నయం కాని ఎన్నో వ్యాధులను యోగాభ్యాసం ద్వారా నయం చేసుకోవచ్చు. యోగా మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

క్రీడాకారులకు యోగా ప్రయోజనాలు 

క్రీడాకారులు యోగా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. అలాగే బలంగా కూడా అవుతుంది. 
యోగా క్రీడాకారుల్లో ఏకాగ్రతను పెంచుతుంది. 
శరీరం, మనస్సు మధ్య సామరస్యాన్ని కలిగిస్తుంది. 
శరీరాన్ని చురుగ్గా మారుస్తుంది.
గాయాలను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే గాయాలు త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది. 
శారీరక, మానసిక ఒత్తిడుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

click me!