దుస్తులకు చెమట వాసన పోవాలంటే ఏం చేయాలి?

First Published Jun 12, 2024, 2:55 PM IST

మండుతున్న ఎండలకు అండర్ ఆర్మ్స్ లోనే కాకుండా శరీరమంతటా చెమలు కారిపోతుంటాయి. దీనివల్ల దుస్తులు పచ్చిగా అవ్వడమే కాకుండా దుస్తుల నుంచి చెమట వాసన కూడా వస్తుంటుంది. ఈ చెమట వాసన దుస్తులకు రాకుండా ఉండటానికి ఏం చేయాలో తెలుసా?
 

ఎండాకాలంలో ఎంత మంచి దుస్తులైనా బయటకు ఎండలోకి వెళ్లగానే చెమటతో తడిసి ముద్దవుతుంది. దీనికి తోడు దుస్తుల నుంచి చెమట వాసన రావడం ప్రారంభమవుతుంది. దీనివల్ల జనాల్లోకి వెళ్లడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే దుస్తులకు ఉన్న చెమట వాసనను పోగొట్టడానికి కొన్ని చిట్కాలు బాగా సహాయపడతాయి.అవేంటంటే?
 

చెమట వాసన 

చెమట వాసన ఎక్కువగా దుస్తుల అండర్ ఆర్మ్స్ లో ఎక్కువగా వస్తుంటుంది. చాలాసార్లు దుస్తులను ఉతికిన తర్వాత కూడా చెమట వాసన పోదు. అందులోనూ దుస్తులను తరచుగా ఉతకడం వల్ల దుస్తులు కూడా తొందరగా చిరిగిపోతాయి. 

నిమ్మకాయ

నిమ్మకాయలతో కూడా బట్టలకు అంటుకున్నచెమట వాసనను పోగొట్టొచ్చు. ఇందుకోసం దుస్తులు ఉతుక్కునేటప్పుడు నీటిలో నిమ్మరసాన్ని కలపండి. దీనివల్ల చెమట వాసన సులువుగా పోతుంది. 
 

బేకింగ్ సోడా 

దుస్తుల వాసనను తొలగించడానికి బేకింగ్ సోడా కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం దుస్తులను ఉతికే నీటిలో బేకింగ్ సోడా మిక్స్ చేసి బట్టలను శుభ్రం చేయండి. దీనివల్ల దుస్తులపూ ఎలాంటి చెడు ప్రభావం పడదు.

ఎండలో

చాలా మంది దుస్తులను నీడలోనే ఆరబెడుతుంటారు. దీనివల్ల దుస్తులు తొందరగా చిరిగిపోవని, అలాగే రంగు కూడా పోదని. నిజానికి నీడలో ఆరేయడం వల్ల బట్టలు చాలా రోజుల వరకు కొత్తవాటిలా కనిపిస్తాయి. కానీ దుస్తులను ఎండలో ఆరేస్తే చెమట వాసన పోతుంది. ఇది సులభమైన మార్గం కూడా. 
 

వెనిగర్

వెనిగర్ తో కూడా దుస్తుల చెమట వాసనను పోగొట్టొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక బకెట్ లో వేడినీళ్లు తీసుకోవాలి. అందులో 2 టీస్పూన్ల వెనిగర్ వేసి బట్టలను నానబెట్టాలి. కాసేపటి తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి.

బట్టలను ఎక్కువ సేపు నానబెట్టకూడదు. 

చాలా మంది దుస్తులను చాలా సేపటి వరకు నీటిలో నానబెడుతుంటారు. కానీ దీనివల్ల అవి దుర్వాసన వెదజల్లుతాయి. మీ దుస్తుల నుంచి దుర్వాసన రాకూడదంటే మాత్రం మీరు వీటిని కాసేపు మాత్రమే నీటిలో నానబెట్టాలి.  ఈ ఇంటి పద్దతులను అవలంబించడం వల్ల దుస్తులు చక్కటి వాసన వస్తాయి. 

Latest Videos

click me!