రోజూ స్నానం చేయాలా? చేయకపోతే ఏమౌతుంది?

First Published | Aug 9, 2024, 11:04 AM IST

కొంతమంది ప్రతిరోజూ స్నానం చేస్తే.. మరికొంతమంది రోజు తప్పించి రోజో లేకపోతే రెండు రోజులకోసారో స్నానం చేస్తుంటారు. కానీ డార్టక్లు, ఆరోగ్య నిపుణులు మాత్రం ప్రతిరోజూ స్నానం చేయాలంటారు. ఎందుకో తెలుసా?
 

రోజూ స్నానం చేసే అలవాటు చాలా మంచిది. ఇది మిమ్మల్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటుగా ఎన్నో వ్యాధులకు కూడా మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. రెగ్యులర్ గా స్నానం చేస్తే మీ మానసిక స్థితి పెరుగుతుంది. అలాగే మీరు ఉల్లాసంగా ఉండటంతో పాటుగా ఎన్నో లాభాలు కలుగుతాయి. అసలు రోజూ స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

bath

మానసిక ఉల్లాసం

ప్రతిరోజూ స్నానం చేసేవారు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. స్నానం మీ మానసిక స్థితి పెంచుతుంది. అలాగే ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే ఇది మీ మొత్తం మానసిక శ్రేయస్సును మెరుగ్గా ఉంచుతుంది. 
 


wife bathing

మెరుగైన రక్త ప్రసరణ

శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే మీరు ప్రతిరోజూ స్నానం ముఖ్యంగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాదు ఇది కండరాల సడలింపునకు, మొత్తం శక్తికి సహాయపడుతుంది.
 

చర్మ ఆరోగ్యం

ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల మన చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రోజువారి స్నానం మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, దాని సహజ నూనెలను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మం పొడిబారే అవకాశం కూడా తగ్గుతుంది. రోజూ స్నానం చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. 
 

Taking a Shower

శ్వాసకోశ ప్రయోజనాలు

గోరువెచ్చని షవర్ నుంచి వచ్చే ఆవిరి నాసికా మార్గాలను క్లియర్ చేయడానికి, శ్వాసను సులభతరం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అలెర్జీలు లేదా శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

కండరాల సడలింపు


వెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల కండరాల  ఉద్రిక్తత తగ్గుతుంది. ఇది కండరాల నొప్పిని, ఒంటి నొప్పిని తగ్గిస్తుంది. అలాగే కండరాల అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది అలసిన శరీరానికి విశ్రాంతినివ్వడానికి బాగా సహాయపడుతుంది. 

Latest Videos

click me!