పరిగడుపున కొత్తిమీర నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 21, 2024, 3:34 PM IST

కొత్తిమీరలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడటానికి బాగా సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో కొత్తిమీర నీటిని క్రమం తప్పుకుండా తాగితే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కొత్తిమీర ఒక పవర్ ఫుల్ మసాలా దినుసు. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, జీర్ణ సమస్యలను నయం చేయడానికి ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా దీన్ని ఆహార రుచిని పెంచడానికి కూడా ఉపయోగిస్తున్నారు. కొత్తిమీరలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కొత్తిమీర వాటర్ ను ఉదయాన్నే పరిగడుపున తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 
 

కొత్తిమీరలో శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే సహజ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ 'చెడు' కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.  
 


కొత్తిమీరలో ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవొక మొక్కల సమ్మేళనాలు. ఇవి మన గట్ లోని కొవ్వు శోషణను నిరోధించగలవు. ఇది గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది కూడా. వివిధ ఆరోగ్య సమస్యలే రాకుండా ఉండటానికి  ఖాళీ కడుపుతో కొత్తిమీర నీటిని క్రమం తప్పకుండా తాగాలని నిపుణులు చెబుతున్నారు. 
 

కొత్తమీర వాటర్ మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కొత్తిమీర నీటిని పరిగడుపున తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 


కొత్తిమీరలో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. నిజానికి కొత్తిమీర కూడా యాంటీ ఆక్సిడెంట్ల భాండాగారం.  కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొత్తిమీర నీటిలో విటమిన్ ఎ ఉండటం వల్ల ఇది కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

മൂന്നില്‍ രണ്ടുഭാഗം

కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే కొత్తిమీర నీటిని తాగడం వల్ల మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.  కొత్తిమీరలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.  కొత్తిమీర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.


కొత్తిమీర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఖాళీ కడుపున ఆ నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. కొత్తిమీర నీరు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడుతుంది. ఈ వాటర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారుకూడా  కొత్తిమీర నీటిని డైట్ లో చేర్చుకోవచ్చు.

coriander leaves water


కొత్తిమీరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్లు పుష్కలంగా ఉండే కొత్తిమీర నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.

కొత్తిమీర నీటిని ఎలా తయారు చేయాలి?

గుప్పెడు కొత్తిమీర ఆకులను తీసుకొని 500 మిల్లీలీటర్ల నీటిలో 10 నిమిషాల పాటు మరిగించండి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి తాగండి. 

Latest Videos

click me!