సుఖదు:ఖాలు, నవ్వు, ఏడుపు చాలా కామన్. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. భావోద్వేగాలకు అనుగుణంగా నవ్వుతాం, ఏడుస్తాం, ఆనందిస్తాం, బాధపడతాం. మనం సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాం, బాధైనప్పుడు ఏడుస్తాం. నవ్వు మన మనసును తేలిక పరుస్తే, ఏడుపు మనసులోని దుఃఖాన్ని బయటకు పంపుతుంది. బాధైనప్పుడు ఏడవడం కామన్. కానీ ఈ ఏడుపును ఆపుకోవడం మాత్రం చాలా కష్టం. కొంతమంది ఏడవడానికి సిగ్గుపడుతుంటారు. ముఖ్యంగా మగవారు. మగవారు ఏడవకూడదని ఆడవాళ్లే ఏడవాలని అంటుంటారు. ఆడవాళ్లైనా, మగవారైనా బాధ వచ్చినప్పుడు కంట్లోంచి నీళ్లు రావడం సహజం.