బరువు తగ్గడానికి.. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండాలంటే ఇవి తినండి..

Published : Dec 10, 2022, 09:53 AM IST

బరువు తగ్గాలంటే హెవీగా తినకూడదు. అలా తినకూడదంటే.. కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉండాలి. అప్పుడే మీరు తక్కువగా తిని తొందరగా బరువు తగ్గుతారు.  

PREV
17
బరువు తగ్గడానికి.. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండాలంటే ఇవి తినండి..
weight loss

చాలా మంది బరువు తగ్గాలనుకుంటారు. కానీ ఆకలిని మాత్రం నియంత్రించలేకపోతుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు మోతాదుకు మించి తినడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. అందురూ అనుకున్నట్టు.. ఆహారాన్ని తినడం మానేయడం లేదా ఆకలితో పేగులను మాడ్చడంవల్ల బరువు తగ్గుతారనేది కేవలం మన భ్రమే. ఎందుకుంటే ఆకలితో ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. పుష్కలంగా తినాలి. అదికూడా పోషకాహారాన్నే..

27
Weight Loss

అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మీరు అతిగా తినకుండా ఉంటారు. ఆకలిని నియంత్రిస్తారు. రోజంతా కొంచెం కొంచెం ఆహారాన్ని తీసుకుంటే కూడా మీరు అతిగా తినకుండా ఉంటారు. కేలరీలు కూడా బాగా తగ్గుతారు. బరువు తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇంతకీ కడుపు నిండుగా ఉండటానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37
fiber

ఎక్కువ ఫైబర్ కంటెంట్ ను తీసుకోండి

ఫైబర్ కంటెంట్ ఇతర పోషకాల కంటే నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇది ఎక్కువ సేపు  కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించడానికి సహాయపడుతుంది. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను రోజూ తినాలి. ఇందుకోసం క్యారెట్లు, దోసకాయలు, ఆపిల్, సెలెరీ వంటి ఆహారాలను తినండి.
 

47

మీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయండి

మీరు తినే భోజనం మీ రక్తంలో చక్కెరను సమతుల్యం చేసేలా చూసుకోండి. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే.. ఆహార కోరికలు బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో ఆరోగ్యాన్ని పాడుచేసే ఆహారాలనే తినాలనిపిస్తుంది. అనవసరమైన ఆహార కోరికలను తగ్గించడానికి కార్భోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు అనే ఈ మూడు మాక్రోన్యూట్రియెంట్లు ఉన్న సమతుల్య భోజనం చేయండి. 
 

57
water

నీళ్లను ఎక్కువగా తాగండి

మీరెక్కడికి వెళ్లినా నీళ్ల బాటిల్ ను పక్కాగా తీసుకెళ్లండి. ఎందుకంటే ఈ నీళ్లు మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడమే కాదు.. ఆకలి బాధలను కూడా తగ్గిస్తాయి. ఎందుకంటే దాహం వల్ల కూడా ఆకలిగా అనిపిస్తుంది. ఎందుకంటే దాహం సంకేతాలు బలహీనంగా ఉంటాయి. నీళ్లు మన కడుపులోని స్ట్రెచ్ గ్రాహకాలను సక్రియం చేస్తుంది. దీంతో ఆకలి హార్మోన్లను తగ్గుతాయి. 
 

67
maida

తెల్లపిండి పదార్థాలను తినకండి

తెల్లని రొట్టెలు, పేస్ట్రిలు వంటి శుద్ధి చేసిన పిండితో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటివల్ల ఆకలి కోరికలు బాగా పెరుగుతాయి. అందులోనూ ఈ రకమైన పిండి పదార్థాలు శరీరం ద్వారా త్వరగా ప్రాసెస్ చేయబడవు. వీటిని తింటే భోజనం చేసిన వెంటనే మీకు ఆకలిగా అనిపిస్తుంది. 
 

77
protein rich foods

ప్రోటీన్ ను ఎక్కువగా తినండి

ప్రోటీన్ ఫుడ్ మన శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే భోజనం చేసిన తర్వాత మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. కార్భోహైడ్రేట్ల కంటే ప్రోటీన్ ఫుడ్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రోటీన్లు, కార్భోహైడ్రేట్లు కలిగి ఉన్న ఆహారాన్ని  తినేటప్పుడు మీ రక్తంలో  చక్కెర స్థాయిల వేగం నెమ్మదిస్తుంది. ఇది మీ రక్తంలో చక్కెర, ఆకలి స్థాయిలను కొన్ని గంటల్లో పెరగకుండా కాపాడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories