ఈ మసాలా దినుసులతో ఎంత ఫాస్ట్ గా బరువు తగ్గుతారో తెలుసా..?

First Published Sep 27, 2022, 10:01 AM IST

మనం వంటల్లో ఉపయోగించే కొన్ని రకాల మసాలా దినుసులు కూడా బరువు తగ్గేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నయం చేయగలవు. 
 

చిన్నపిల్లలు, యువత, మధ్యవయస్కులు అని తేడా లేకుండా నేడు చాలా మంది ఓవర్ వెయిట్ తో  ఇబ్బంది పడుతున్నారు. ఈ బరువు మనం తినే ఫుడ్, జీవన శైలి, వంశపారంపర్యంగా వంటి కారణాల వల్ల పెరుగుతుంది. బరువు తగ్గాలంటే ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, లేట్ నైట్ దాక మేలుకువ ఉండటం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే కొవ్వు, కార్బోహైడ్రేట్లు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడే బరువు సులువుగా తగ్గగలుగుతారు. 
 

weight loss


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వంటల్లో ఉపయోగించే కొన్ని రకాల మసాలా దినుసులు కూడా బరువు తగ్గేందుకు సహాయపడతాయట. ఈ మసాలా దినుసులకు ఎన్నో వ్యాధులను నయం చేసే సామర్థ్యం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. బరువు తగ్గేందుకు ఎలాంటి మసాలా దినుసులు ఉపయోగపడతాయో తెలుసుకుందాం పదండి. 

అల్లం

భారతీయ వంటల్లో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ అల్లంలో జింజెరోల్స్, షోగోల్స్ అని పిలిచే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే డయాబెటీస్ ను నియంత్రిస్తాయి కూడా. బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. ఈ అల్లానికి కాస్త నిమ్మరసాన్ని జోడించి తీసుకుంటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. 

cinnamon

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. అలాగే హృదయ సంబంధ రోగాల కూడా ముప్పును కూడా తగ్గిస్తుంది. మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు ఈ  మసాలా దినుసు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. ఇందుకోసం రెగ్యులర్ గా ఉదయం పరిగడుపున దాల్చిన చెక్క నీటిని తాగాలి. 

మెంతులు

మెంతులు కూడా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం మెంతులు మరిగించిన నీటిని తాగితే.. ఊబకాయం తగ్గడంతో పాటుగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. 
 

garlic

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ వెల్లుల్లి ఊబకాయాన్ని తగ్గించడమే కాదు.. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది. 
 

యాలకులు

యాలకులు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. వీటిలో జీవక్రియను పెంచే సామర్థ్యం ఉంటుంది. యాలకులు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుంది. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
 

జీలకర్ర

జీలకర్ర కూడా బరువు తగ్గేందుకు సహాయపడతుంది. ప్రతి రోజూ ఉదయం పరిగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు తగ్గిపోతుంది. ఈ వాటర్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వాటర్ బరువు తగ్గేందకు కూడా సహాయపడతుంది. ఒక టీస్పూన్ జీలకర్రలో ఎనిమిది కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి జీలకర్రను మీ రోజు వారి ఆహారంలో భాగం చేసుకోండి. ఈ జీరా వాటర్ ను తాగడం వల్ల జీర్ణక్రియకు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే శరీరం నుంచి విషం బయటకు పోతుంది.
 

black pepper

నల్ల మిరియాలు

నల్ల మిరియాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ మిరియాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, కాల్షియం, సోడియంలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఈ మిరియాలు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. 
 

పసుపు

పసుపులో ఉండే కర్కుమిన్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బాక్టీరియల్ వ్యాధులు, నయం కాని అల్సర్లు, వాపు మొదలైన వాటిని తగ్గించేందుకు శరీర బలాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వైరస్ కు వ్యతిరేకంగా పసుపు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. బరువు తగ్గడానికి కూడా పసుపు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పుసుపులో  కొవ్వును కరిగించే సామర్థ్యం ఉంటుంది. బెల్లీఫ్యాట్ ను కూడా కరిగించుకోవచ్చు. ఇందుకోసం ఒక గ్లాసు నీటిని మరిగించి అందులో అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ అల్లం రసం కలపాలి. దీన్ని ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తాగితే సులువుగా బరువు తగ్గుతారు. 
 

click me!