చిలగడదుంపలు తింటే బరువు తగ్గుతారా?

Published : Oct 27, 2022, 04:57 PM IST

డయాబెటీస్ కేర్ లో ప్రచురించడిన అధ్యయనం ప్రకారం.. చిలకడదుంపలను తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ రోగుల రక్తతంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా తగ్గాయి. అంతేకాదు ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.  

PREV
17
చిలగడదుంపలు తింటే బరువు తగ్గుతారా?

చిలగడదుంపలు చాలా తియ్యగా, టేస్టీగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. నిజానికి దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి బరువు తగ్గేందుకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చిలగడదుంపల్లో ఫైబర్ తో పాటుగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

27

100 గ్రాముల చిలగడదుంపలల్లో 70 శాతం కంటే ఎక్కువ నీరుంటుంది. దీనిద్వారా మన శరీరానికి 28 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.6 గ్రాముల ప్రోటీన్, 120 కేలరీలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. 

37

చిలగడదుంపలు రూట్ వెజిటేబుల్ అయినప్పటికీ.. దీనిని తొక్కతో సహా తినడం వల్ల ప్రతి 100 గ్రాములకు సుమారు 4 గ్రాముల ఫైబర్ అందుతుంది. దీనివల్ల చాలా త్వరగా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్, లేదా జిఐ, భోజనం తరువాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎంత ఉన్నాయో చూపించడానికి ఉపయోగించబడుతుంది. తొక్కతో ఉడకబెట్టిన చిలగడదుంపల్లో జిఐ 60  గాఉంటుంది. చిలగడదుంపల్లలో కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని మోతాదులోనే తినాలని నిపుణులు చెబుతున్నారు.

47

వ్యాయామం చేసేటప్పుడు మంచి పోషకాహారం తినాలి. పనీర్, నట్స్ లేదా గుడ్లలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే వీటితో పాటుగా చిలగడదుంపలను కూడా తినొచ్చు. వీటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చిలగడదుంపల్లో విటమిన్ బి5, విటమిన్ బి6 లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియ సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా అవసరం. 

57
sweet potato

డయాబెటిస్ కేర్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. చిలగడదుంపలను తినడం టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చాలా వరకు తగ్గాయి. ఇది గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరుస్తుంది.

67

చిలగడదుంపలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. పెద్దప్రేగు, మూత్రాశయం, కడుపు, రొమ్ముతో సహా కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను చంపడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
 

77

చిలగడదుంపలలో ఉండే పొటాషియం శరీరంలో సోడియం పేరుకుపోకుండా సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గింస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories