చలికాలం షురూ అయ్యింది. ఈ సమయంలో జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఋతువులలో మార్పుల కారణంగా.. దాదాపుగా ప్రతి ఒక్కరూ జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతుంటారు. ఇవి జస్ట్ సీజన్ మారడం వల్లే వస్తుంటాయి. అయితే చాలా మంది సీజన్లతో సంబంధం లేకుండా తరచుగా శారీరక సమస్యలతో బాధపడుతుంటారు. పదే పదే అనారోగ్యానికి గురవుతుంటారు. కొన్నిసార్లు జ్వరం, ఇంకొన్ని సార్లు జలుబు-దగ్గు లేదా కడుపు సమస్యలు మళ్లీ మళ్లీ వస్తుంటాయి. ఇలాంటి వాళ్లు జీవనశైలిలో ఈ మార్పులు చేసుకుంటే మీకు ఇలాంటి అనారోగ్య సమస్యల బాధ తప్పుతుంది. అవేంటో తెలుసుకుందాం పదండి..