Weight loss tips: ఇవి తింటే తొందరగా బరువు తగ్గుతారు తెలుసా..

Published : May 31, 2022, 02:10 PM IST

Weight loss tips: బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలను చేస్తుంటారు. ఇలాంటి వారికి కొన్ని రకాల ఆహార పదార్థాలు బరువును తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. అవేంటంటే.   

PREV
16
Weight loss tips: ఇవి తింటే తొందరగా బరువు తగ్గుతారు తెలుసా..

బరువు పెరడగం ఎంత సులువో.. బరువు తగ్గడం అంతకు మించి కష్టం. ఎందుకంటే బరువు పెరిగినంత తొందరగా బరువు తగ్గడం సాధ్యం కాదు. అందులోనూ బరువు తగ్గే ప్రాసెకస్ చాలా నెమ్మదిగా సాగుతుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటుగా ఆహారంపై పై కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. 

26

బరువు తగ్గాలనుకునే వారు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది, ఎందుకంటే ఇవి బరువును మరింత పెంచడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది. అయితే కొన్ని రకాల  ఆహార పదార్థాలు సులువుగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

36

పెరుగు (Yogurt).. బరువు తగ్గాలనుకునేవారు రాత్రి భోజనం చేసిన తర్వాత కొద్దిగా పెరుగును తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ పెరుగులో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇక వీటిలో ఉండే ప్రోటీన్ కండరాలకు బలాన్ని ఇస్తుంది. ఇక పెరుగులో ఉండే సూక్ష్మ పోషకాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడమే కాదు బరువును కూడా తగ్గిస్తాయి. 

46

బాదం పప్పులు (Almond beans).. చాలా మందికి రాత్రుళ్లు ఉన్నట్టుండి.. ఆకలి అవుతూ ఉంటుంది. ఇది కూడా రాత్రుళ్లు ఆలస్యంగా పడుకునే వారిలోనే కనిపిస్తుంది. ఇలాంటి వారికి బాదం పప్పులు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే బాదం పప్పులను తినడం వల్ల కడుపు ఎక్కువ  సేపు నిండుగా ఉన్నభావన కలుగుతుంది. వీటిలో పోషకాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. 

56

హోల్ గ్రెయిన్ బ్రెడ్ (Whole grain bread).. రాత్రిపూట ఆకలిగా అనిపిస్తే మీరు 2  Whole grain bread ముక్కలపై వేరుశెనగ వెన్నను పెట్టుకుని తినొచ్చు. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మీరు తొందరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

66

అరటిపండ్లు (Bananas).. అరటిపండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిని తినడం వల్ల బరువు తొందరగా తగ్గుతారని మీరు వినే ఉండొచ్చు.  ఎందుకంటే ఈ పండులో పీచు పదార్థం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఆకలి కాకుండా చూస్తుంది. అంతేకాదు ఈ పండు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories