Turmeric for Weight Loss: పసుపుతో కూడా బరువు తగ్గొచ్చా..?

Published : Jun 26, 2022, 04:56 PM IST

Turmeric for Weight Loss: పసుపు ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఇది బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.  

PREV
110
 Turmeric for Weight Loss: పసుపుతో కూడా బరువు తగ్గొచ్చా..?

పసుపును ఎన్నో వ్యాధులకు చికిత్స చేయడానికి, వాటి నివారణ కొరకు ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant), యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory), యాంటీమైక్రోబయల్ (Antimicrobial), యాంటి క్యాన్సర్ (Anticancer) లక్షణాలు ఉన్నాయి. పసుపును సౌందర్య లేపనంగా కూడా వాడుతుంటారు. 

210
Turmeric

పసుపులో పోషకాలు చాలా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి (Immunity)ని పెంచడానికి,  చర్మ సంరక్షణ (Skin care) లోనూ సహాయపడతాయి. కానీ పసుపు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని మీకు తెలుసా?అవును పసుపు అధికంగా ఉండే ఆహారాలు బరువు తగ్గడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

 

310

పసుపు రోగ నిరోధక శక్తిని (Immunity power) పెంచుతుంది. పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడే శక్తి కలిగి ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల (Cancer cells) విస్తరణను నిరోధిస్తుంది. పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ ఉండడంతో ఇది ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగా ఉపయోగపడుతుంది.
 

410

పసుపులోని కర్కుమిన్ గుండె జబ్బులను (Heart disease) నివారిస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కార్డియోటాక్సిసిటీ, డయాబెటిస్ సంబంధిత గుండె సమస్యలను నివారిస్తాయి. పసుపులోని కర్కుమిన్ స్థూలకాయానికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తుంది. ఇది శరీర కొవ్వును (Fat) కరిగించే ప్రక్రియను పెంచుతుందని ఒక పరిశోధనలో తేలింది.
 

510

పసుపు బరువును ఎలా తగ్గిస్తుంది: పసుపు కొవ్వు కణాల ఏర్పాటును తగ్గిస్తుంది. తద్వారా శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గిపోతాయి. అలాగే బరువు పెరగకుండా నిరోధిస్తుంది. పసుపు మంచి యాంటీ ఆక్సిడెంట్. అలాగే జీర్ణ సంబంధిత సమస్యను కూడా దూరం చేస్తుంది. 

610

ఇటీవలి పరిశోధకులు బరువు తగ్గడంలో పసుపు పాత్రను పరిశీలించారు. కర్కుమిన్ ఊబకాయానికి దోహదపడే నిర్దిష్ట Inflammatory markers అణిచివేస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. పసుపు చక్కెర స్థాయిలను (Sugar levels)నియంత్రించడానికి, ఇన్సులిన్ నిరోధకత (Insulin resistance)ను నిరోధించడానికి పనిచేస్తుంది. కాబట్టి శరీరంలో కొవ్వులు నిల్వ ఉండవు.
 

710

ఊబకాయం (Obesity), మధుమేహం (Diabetes)బారిన పడే అవకాశం ఉన్నవారికి పసుపు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతారు. పసుపును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పైత్యరస ఉత్పత్తి పెరుగుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే కొద్దిగా పసుపు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇది రోజంతా మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.

810

పసుపులో ఉండే కుర్కుమిన్ వైట్ ఫ్యాట్ ను బ్రౌన్ ఫ్యాట్ గా మారుస్తుంది. వైట్ ఫ్యాట్ అనేది చర్మం కింద పేరుకుపోయే ఒక రకమైన కొవ్వు. ఇది ఊబకాయానికి కారణమవుతుంది. పసుపు ఈ కొవ్వును బ్రౌన్ ఫ్యాట్‌గా మారుస్తుంది, ఇది కొవ్వును కాల్చివేస్తుంది. ఫలితంగా వచ్చే గ్లూకోజ్‌ను శక్తిగా మారుస్తుంది. పాలలో పసుపు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

910

పసుపు రోగ నిరోధక శక్తిని (Immunity power) పెంచుతుంది. పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడే శక్తి కలిగి ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల (Cancer cells) విస్తరణను నిరోధిస్తుంది. పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ ఉండడంతో ఇది ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగా ఉపయోగపడుతుంది.
 

1010

పసుపు జీర్ణక్రియను (Digestion) కూడా మెరుగుపరుస్తుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory) గుణాలు అన్నవాహికలో కలిగే మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, కాలేయ వ్యాధి, విరేచనాలు వంటి జీర్ణ సంబంధ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories