
అధిక బరువు (overweight)అత్యంత ప్రమాదరకం. దీనివల్ల ప్రాణాంతకమైన రోగాలొచ్చే అవకాశం ఉంది. మధుమేహం (diabetes), గుండె జబ్బులు (Heart diseases), మూత్రపిండాల సమస్యలు (Kidney problems) వంటి ఎన్నో రోగాలకు అధిక బరువు కారణమవుతుంది. బరువు పెరగడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా ఆత్మవిశ్వాసం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకొంత మంది బరువున్న వారైతే ఆందోళన, నిరాశ వంటి సమస్యలతో బాధపడుతున్నారట.
అర్థరాత్రుళ్లు అతిగా తినడం, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం, చెడు జీవనన శైలి వంటివి బరువును పెంచుతాయి. సరైన జీవన శైలిని అలవర్చుకుని కొన్ని ఆహారనిబంధనలను పాటిస్తే సులభంగా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అయితే కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు బరువును తగ్గించండంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇవి జీకక్రియ రేటును పెంచుతాయి. దీంతో బరువు ఫాస్ట్ గా తగ్గుతుంది. సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద మూలికలు బరువును తగ్గించడానికి సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
త్రిఫల (triphala)
త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొవ్వును కరిగించే ప్రాసెస్ ను వేగవంతం చేస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల కొవ్వు కణాలు ఉత్పతి చేసే విషం శరీరం నుంచి బయటకు వెళుతుంది. మొత్తంగా ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.
అంతేకాదు ఇది ప్రేగు కదలికలను కూడా ప్రేరేపిస్తుంది. కడుపు ఉబ్బరం వంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
పసుపు (Turmeric powder)
బంగారు వర్ణంలో పసుపు ఎన్నో ఔషద గుణాలను కలిగి ఉంటుంది. దీనిలో పుష్కలంగా ఉండే కర్కుమిన్ కొవ్వు కణజాల పెరుగుదలను అడ్డుకుంటుంది. పసుపు నీటిని రెగ్యులర్ గా తాగడం పిత్తం ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో బరువు తగ్గడం చాలా సులువు అవుతుంది. అంతేకాదు ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
దాల్చిన చెక్క (Cinnamon)
ఇది కూరలకు రుచిని పెంచడమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. ఇది జీవక్రియ రేటును పెంచడంతో పాటుగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీనిని పొడిరూపంలో తీసుకుంటే ఉత్తమ ఫలితాలొస్తాయి. ఈ పొడిని టీ లేదా ఇతర ఆహారాల్లో వేసుకుని తీసుకుంటే మంచిది. నీటిలో ఈ దాల్చిన చెక్క పౌడర్ ను వేసుకుని తీసుకున్నా తొందరగా బరువు తగ్గుతారు. దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల కొవ్వు కణాలు విచ్ఛిన్నం అవుతాయి. బయటకు కూడా పంపబడతాయి. రెగ్యులర్ గా ఈ నీళ్లను తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో ఎంతో సహాయపడుతుంది.
అల్లం (ginger)
అల్లం ఎన్నో రోగాలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను వదిలిస్తాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. దీంతో శరీరంలో మంట తగ్గుతుంది. అల్లాన్ని కొంతమొత్తంలో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అదనపు బరువును కిలోల్లో కోల్పోవచ్చు. అంతేకాదు ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది.
అశ్వగంధ (Ashwagandha)
అశ్వగంధ గుండె సమస్యలను, మధుమేహ సమస్యలను తగ్గించండంలో ముందుంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే బరువు తగ్గే ప్రాసెస్ ను కూడా వేగవంతం చేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచడానికి సహాయపడుతుంది. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడితే బరువు తగ్గడం అసాధ్యమవుతుంది. కాగా రోగనిరోధ వ్యవస్థ బరువు తగ్గడంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. ఈ హార్మోన్లను నియంత్రించడంలో అశ్వగంధ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
మెంతులు (Methi)
మెంతులు కూడా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. అంతేకాదు ఆహారం తీసుకోవాలనే కోరికలను కూడా తగ్గిస్తుంది. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. మెంతులు బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లలు, ఫైబర్ శరీరానికి హాని చేసే విషపదార్థాలను శరీరం నుంనచి బయటకు పంపుతాయి.