Coffee Vs. Green Tea: కాఫీ, గ్రీన్ టీ లల్లో ఏది బెస్ట్

First Published Jul 4, 2022, 4:58 PM IST

Coffee Vs. Green Tea: కాఫీ, గ్రీన్ టీ రెండూ కూడా మన ఆరోగ్యానికి  మంచి చేసేవిగానే పరిగణించబడ్డాయి. అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే మన ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తుంది. 

టీ, కాఫీలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే కదా.. నగరాల్లో సందు సందుకో కాఫీ, టీ షాప్ లు దర్శనమిస్తున్నాయి. టీ లేదా కాఫీ తాగనిదే బెడ్ కూడా దిగని వారు చాలా మందే ఉన్నారు. వీటిని తాగడం వల్ల మనపై ప్రభావం ఎక్కువగానే పడుతుంది. అది మంచిది కావొచ్చు.. చెడుది కావొచ్చు. అందుకే మనం తాగే పానీయాలు మనపై ఏ విధమైన ప్రభావాలను చూపుతాయని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

espressos

ఇక ఈ రోజుల్లో టీ, కాఫీ లకు బదులుగా కొంతమంది గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకున్నారు. కారణం ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఇంతకీ ఈ మన ఆరోగ్యానికి గ్రీన్ టీ మంచిదా? లేకపోతే కాఫీ మంచిదా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గ్రీన్ ఆరోగ్య ప్రయోజనాలు

జీవక్రియను మెరుగుపరుస్తుంది:  గ్రీన్ టీ తాగడం వల్ల జీవక్రియకు మేలు జరుగుతుందని పలు పరిశోధనలు ఆధారపూర్వకంగా రుజువు చేశారు. గ్రీన్ టీ తాగడం వల్ల జీవక్రియ వేగంగా పనిచేస్తుంది. దీంతో  శరీరంలో కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి. అంటే బరువు పెరగకూడదు అనుకునే వారికి ఇది బెస్ట్ పానీయం అన్నమాట. ఇది బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

క్యాన్సర్ ను నిరోధించవచ్చు:  గ్రీన్ టీ పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను తగ్గించడానికి, క్యాన్సర్ ను నివారించడాని ఎంతో సహాయపడుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి హానీ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి. 
 

మెదడు పనితీరు మెరుగుపడుతుంది:  గ్రీన్ లో కూడా కెఫిన్ ఎక్కువగానే ఉంటుంది.  ఈ కెఫిన్ మనల్ని ఎనర్జిటిక్ గా మారుస్తుంది. అలాగే మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఈ కెఫిన్ మెమోరీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడుతుంది.

గ్రీన్ టీని తీసుకోవడం వల్ల మెదడుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు రాకుండా గ్రీన్ టీ అడ్డుకుంటుందని నిరూపించబడింది. అంతేకాదు వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, పార్కిన్సరన్స్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. 

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: గ్రీన్ టీ జీవక్రియను పెంచడమే కాదు.. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీని తాగడం వల్ల గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు ఊబకాయులకు ఇది చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది.

కాఫీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

క్యాన్సర్ ను నివారిస్తుంది: కాఫీ డిఎన్ ఏను బలోపేతం చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇది డిఎన్ ఏలో ఎలాంటి మార్పును తీసుకురానప్పటికీ సెల్యూలార్ నష్టం నుంచి కాపాడుతుంది. ఒక వేళ సెల్యులార్ డ్యామేజ్ అయినట్టైతే క్యాన్సర్ బారిన పడతాం. అంతేకాదు చాలా కాలం పాటు సూర్యరశ్మికి గురైతే కూడా సెల్యులార్ డ్యామేజీ అవుతుంది. అయితే సెల్యులార్  డ్యామేజ్ కలిగించే రాడికల్స్ తో పోరాడటానికి కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి. 

కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది:  ఫ్యాటీ లివర్, ఆల్కహాల్ వల్ల కలిగే సిర్రోసిస్, లివర్ క్యాన్సర్, హెపటైటిస్ వంటి కాలెయ వ్యాధులను నివారించండంలో కాఫీలో ఉండె కెఫిన్ ఉపయోగపడుతుంది. ఎలా అంటే కెఫిన్ మన  శరీరంలోకి వెళ్లి పారాక్సాంథైని అనే సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుది. ఇది కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

శక్తిని పెంపొందిస్తుంది:   కాఫీలో ఉండే కెఫిన్ మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.  వ్యాయామం చేసే వారు కాఫీని తాగడం వల్ల వారి శరీరానికి కొంతమొత్తంలో శక్తి లభిస్తుంది.  అలాగే చిత్త వైకల్యం, ఆల్జీమర్స్, న్యూరోడెజెనరేటివ్, పార్కిన్సన్స్ వంటి రుగ్మతలు కూడా తగ్గిపోతాయి. 

ఏది మంచిది

గ్రీన్ టీ, కాఫీ రెండింటిలో గొప్ప ఔషదగుణాలుంటాయి. ముఖ్యంగా వీటిలో కేలరీలు అసలే లేవు. అందుకే ఇవి ఉత్తమ పానీయాలుగా గుర్తించబడ్డాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు గ్రీన్ టీ ని తాగకూడదు. వాళ్లెవరంటే..


వాంతులు, వికారం, 

కడుపు నొప్పి, ఇనుము లోపం
 
మధుమేహం

భయాంధళనలు, ఆందోళన

గుండె సంబంధిత సమస్యలు

కాలేయ వ్యాధులు

గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పిల్లలు గ్రీన్  టీని తాగకూడదు

కాఫీని వీళ్లు తాగకూడదు..

గుండె సంబంధిత వ్యాధులు,  హృదయ స్పందన రేటు సక్రమంగా లేని వారు

నిద్రలేమి సమస్యలున్నవారు

భయాంధోళనలున్నవారు

పిల్లలు

పాలిచ్చే తల్లులు, గర్భిణులు

click me!