కొంతమంది బరువు తగ్గేందుకు ఎన్నో చిట్కాలను ఫాలో అవుతుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అవి శరీర బరువును మరింత పెంచేస్తాయి.
అధిక బరువు, ఊబకాయం చాలా మందిని వేదిస్తున్న ప్రధాన సమస్యలు. ఇవి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తాయి. అందుకే వీలైనంత తొందరగా బరువును తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే కొంతమంది బరువు తగ్గాలని రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడంతో పాటుగా.. స్పెషల్ డైట్ ను కూడా ఫాలో అవుతుంటారు. అంతేకాదు పోషకాలుంటే పండ్లను కూడా తింటుంటారు. అయితే కొన్ని రకాల ఆరోగ్యకరమైన పండ్లు కూడా బరువును అమాంతం పెంచేస్తాయి. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం..
25
అరటి పండ్లు (Bananas)
అరటిపండంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. రోజూ దీన్ని చిరుతిండిగా తినేవారు కూడా ఉన్నారు. వీటిని పరిమితిలో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఈ పండు బరువును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఒకటి కంటే ఎక్కువ అరటిపండ్లను తినకూడదు. ఎందుకంటే అరటి పండ్లలో సహజ చక్కెర కంటెంట్, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మీడియం సైజు (118 గ్రాముల) అరటిపండులో 105 కేలరీలు ఉంటే, 1 గ్రాము ప్రోటీన్ మాత్రమే ఉంటుంది.
35
మామిడి పండు (Mango)
అరటిలో మాదిరిగానే మామిడి పండ్లలో కూడా కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండు మన ఆరోగ్యానికి మంచిదే అయినా దీన్ని తిన్న తర్వాత పక్కాగా కార్డియో వ్యాయామాలు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మామిడి పండులో 1.4 గ్రాముల ప్రోటీన్ ఉంటే.. 99 కేలరీలు ఉంటాయి.
45
avocado
అవొకాడో (Avocado)
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కానీ బరువు తగ్గాలనుకునే వారు మాత్రం వీటిని మితంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
55
ఇవి ఆరోగ్యంగా బరువు పెరగాలనుకునేవారికి చక్కగా ఉపయోగపడతాయి. ఒక మీడియం అవొకాడోలో 162 కేలరీలు ఉంటాయి. అంతేకాదు దీనిలో పొటాషియం, ప్రోటీన్లు, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి5 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.