ప్రేమ కన్నా డబ్బుకే మనిషి ఎందుకు విలువ ఇస్తారు..?

Published : Jul 22, 2022, 12:10 PM IST

ఒక మనిషికి ఆర్థిక సమస్యలు లేకుంటే... చాలా విషయాల్లో ఆనందంగా జీవించవచ్చట. అంతేకాదు.. వారు కోరుకున్న వాటిలో చాలా వాటిని డబ్బుతో పొందవచ్చట.

PREV
110
 ప్రేమ కన్నా డబ్బుకే మనిషి ఎందుకు విలువ ఇస్తారు..?

మనుషులంతా డబ్బు కే ఎందుకు విలువ ఇస్తారు..?  ప్రేమ జీవితంలో అన్నింటికన్నా గొప్పది అని అందరూ చెబుతారు. కానీ.. ప్రజలు ఎందుకు ప్రేమ కన్నా.. డబ్బుకే ఎందుకు విలువ ఇస్తారు అనే సందేహం ఉంటుంది. మనిషిని డబ్బు ఆడిస్తుంది. డబ్బు లేకుంటే.. మన జీవితంలో  చాలా వాటిని చేరుకోలేం. డబ్బు ఏమేమి చేయగలదో ఓసారి చూద్దాం...

210

ఒక మనిషికి ఆర్థిక సమస్యలు లేకుంటే... చాలా విషయాల్లో ఆనందంగా జీవించవచ్చట. అంతేకాదు.. వారు కోరుకున్న వాటిలో చాలా వాటిని డబ్బుతో పొందవచ్చట.

310

చాలా కుటుండాలకు డబ్బు సర్వస్వం. ఎందుకంటే.. చేదిలో రూపాయి లేనిది వారు కనీసం ఒక్కపూట భోజనం కూడా చేయలేరు. వారు కనీసం బతకలేరు. రోజు వారి కూలీలుగా చేసేవారు ఒక్కపూట వారికి డబ్బు అందకున్నా బతకడం కష్టమే అవుతుంది. అలాంటి వారు సమాజంలో చాలా మందే ఉన్నారు.

410
money

ఒకరి కంటూ ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక స్వాతంత్రం ఉంటే.. వారు డబ్బు విషయంలో ఇతరులపై ఆధారపడాల్సిన అసవరం ఉండదు.

510
money

ఒకరు ప్రేమ కాకుండా.. ఆ స్థానంలో డబ్బును ఎంచుకుంటే.. వారికి రిటైర్మెంట్ తర్వాత కూడా తలపై ఒక భారం, ఒత్తిడి లేకుండా ఉంటాయి. భవిష్యత్తులో ఏమైపోతామనే భయం ఉండదు.

610

డబ్బు ఉన్నవారికి బౌండరీలు ఉండవు. ఇంతే చేయాలి.. అంతే చేయాలి అనే లిమిట్ ఉండదు. ఎప్పుడు ఏది కావాలంటే అది కొనుక్కోగల సామర్థ్యం ఉంటుంది.

710

చేతి నిండా డబ్బు ఉన్నవారు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చు. మంచి మంచి వెకేషన్స్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లొచ్చు. ఏది చేయాలన్నా చేసే అవకాశం ఉంది.
 

810
Money tips

కాస్త నమ్మసక్యంగాని విషయం ఏమిటంటే..డబ్బు ఉన్నవారు ఒంటరిగా ఉండటరట. వారి చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఎందుకంటే.. అన్నింటికన్నా డబ్బే ఎక్కువగా అందరినీ ఆకర్షస్తుందట.

910
money 2022

కానీ.. మీరు ఒక్కసారి ప్రేమని కాదని డబ్బును ఎంచుకుంటే.. మీకు నిజంగా ఎప్పటికీ నిజమైన ప్రేమ లభించదు. ఫేక్ ప్రేమ మాత్రమే లభిస్తుంది. మీ చుట్టూ ఫేక్ మనుషులు మాత్రమే ఉంటారు. కావాలన్నా నిజంగా ప్రేమించే వారు దొరకరు.

1010

ఇక జీవితంలో డబ్బును ఎంచుకోవాలా.. ప్రేమను ఎంచుకోవాలా అనే విషయం ఎవరి వ్యక్తిగత విషయం. కొందరు డబ్బు మీద ఇష్టంతో ఆ నిర్ణయం తీసుకోవచ్చు. మరి కొందరు.. అలా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి.. ఈ విషయంలో మనం ఎవరినీ జడ్జ్ చేయలేం.
 

Read more Photos on
click me!

Recommended Stories