స్లిమ్ గా కనిపించాలనుకుంటున్నారా? అయితే మీ డ్రెస్సింగ్ స్టైల్ ను ఇలా మార్చుకోండి..

Published : Jun 03, 2022, 11:48 AM IST

కొన్ని కొన్ని సార్లు మీరు వేసుకునే బట్టలు కూడా మీరు సన్నగా లేదా లావుగా కనిపించేలా చేస్తాయి. ఒక వేళ మీరు స్లిమ్ గా కనిపించాలనుకుంటే మాత్రం మీ డ్రెస్సింగ్ స్టైల్ ( dressing style)ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంతకు లావుగా ఉండేవారు కూడా స్లిమ్ (slim)గా కనిపించాలంటే ఎలాంటి బట్టలను వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
18
స్లిమ్ గా కనిపించాలనుకుంటున్నారా? అయితే మీ డ్రెస్సింగ్ స్టైల్ ను ఇలా మార్చుకోండి..

కొన్ని కొన్ని సార్లు మీరు వేసుకునే బట్టలు కూడా మీరు సన్నగా లేదా లావుగా కనిపించేలా చేస్తాయి. ఒక వేళ మీరు స్లిమ్ గా కనిపించాలనుకుంటే మాత్రం మీ డ్రెస్సింగ్ స్టైల్ ( dressing style)ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంతకు లావుగా ఉండేవారు కూడా స్లిమ్ (slim)గా కనిపించాలంటే ఎలాంటి బట్టలను వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

28

ప్రతి మహిళ తనను తాను స్లిమ్ గా కనిపించాలనుకుంటుంది. అయితే  స్లిమ్ గా కనిపించడానికి మీ డ్రెస్సింగ్ స్టైల్ యే ముందుంటుంది. మీ దుస్తులే మిమ్మల్ని స్లిమ్ గా లేదా లావుగా చూసిస్తాయి. అందుకే మీరు ధరించే దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

38

చాలా మంది మహిళలు బట్టలు కొనేటప్పుడు కేవలం రంగును మాత్రమే చూస్తుంటారు. కానీ మీరు ఇష్టపడే దుస్తులు మీకు నప్పుతాయని చెప్పడం కష్టమే. మీకు ఎలాంటి దుస్తుల్లో నైనా అందంగా కనిపించినా.. కొన్ని రకాల దుస్తుల్లో లావుగా కనిపిస్తారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. బట్టలు కొనేటప్పుడు , వాటిని ధరించేటప్పుడు మీరు కొన్ని విషయాలను గుర్తించుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే మీరు స్లిమ్ గా కనిపిస్తారు.  అవేంటివో ఇప్పుడు తెలుసుకుందాం. 

48

బట్టలను కొనుగోలు  చేసేటప్పుడు మీరు సరైన ప్రింట్ ని ఎంచుకోవాలి. కొంతమంది మహిళలు చెక్స్ లేదా బ్యాలెన్స్ లైన్ ప్రింట్ (Balance line print)దుస్తులను కొంటూ ఉంటారు. కానీ ఇలాంటి దుస్తుల్లో మీరు చాలా లావుగా కనిపిస్తారు. హారిజాంటల్ లైన్ ప్రింట్ (Horizontal line print) డ్రెస్సులు మీకు బాగా నప్పుతాయి. వీటిలో మీరు చాలా స్లిమ్ గా కనిపిస్తారు. 
 

 

58

ఓవర్ సైజ్ కు బదులుగా ఫిట్ డ్రెస్ ఎంచుకోండి: మీరు ఎక్కువ బరువు.. తక్కువ ఎత్తు ఉన్నట్టైతే..  మీకు తగిన దుస్తులు ధరించాలి. లావుగా ఉన్నామని మరీ భారీ సైజు దుస్తులను వేసుకుంటే మీరు మరింత లావుగా కనిపిస్సతారు. మీరు వదులుగా ఉండే దుస్తులను వేసుకోవాలనుకుంటే.. ముదురు రంగు (Dark color) బట్టలను సెలక్ట్ చేసుకోవాలి. 

68

సరైన యాక్ససరీలను ఎంచుకోండి: మీరు అవుట్ ఫిట్ (Out fit)ను వేసుకున్నట్టైతే దానికి సరైన యాక్ససరీలను (Accessories) కూడా ఎంచుకోవాలి. ఒకవేళ మీరు లావుగా ఉన్నట్టైతే సన్నని బెల్ట్ కు బదులుగా మందపాటి బెల్ట్ ఉపయోగించండి. ఇది మీ బొడ్డు కొవ్వు (Belly fat)ను దాచడానికి సహాయపడుతుంది. ఇది మిమ్మల్ని స్లిమ్ గా కనిపించేలా చేస్తుంది.

78

మీరు స్లిమ్ లుక్  లో కనిపించాలనుకుంటే.. స్టైల్ మరియు ట్రెండ్ కు అనుగుణంగా టాప్స్ ను ఎంచుకోవడానికి బదులుగా మీ సైజుకు అనుగుణంగా ఉండే టాప్ లనే ఎంచుకోండి. మీరు ఓవర్ సైజ్ స్లీవ్ లు, గిర్డిల్ టాప్ లు, బెలూన్ టాప్ లు,కఫ్తాన్ టాప్ లను ధరించకపోవడమే మంచిది. వీటిలో మీరు మరింత లావుగా కనిపింస్తారు. వీటికి బదులుగా మంచి ప్రింట్ ఉన్న స్ట్రెయిట్ స్లీవ్స్, 3/4 స్లీవ్స్ ఉన్న టాప్స్ న ధరించండి. ముఖ్యంగా  Bright రంగులో ఉండి మీరు స్లిమ్ గా కనిపించే  వాటినే ధరించాలి. 

88

స్లిమ్ లుక్ కోసం మీరు జీన్స్ వేసుకోవచ్చు: కొన్ని రకాల జీన్స్ లు కూడా మీరు లావుగా లేదా సన్నగా కనిపించేలా చేస్తాయి. అందుకే వీటిని కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కిన్ ఫిట్ జీన్స్ వేసుకుంటే ఊబకాయం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. లూజ్ సైజ్ జీన్స్ లో ఎక్కువ లావుగా కనిపిస్తాయి. మీరు స్లిమ్ లుక్ కోసం పెన్సిల్ జీన్స్ ధరించడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories