Laundry Tips: టైం వృథా అవ్వకూడదని టవల్స్, బెడ్ షీట్స్, బట్టలు అన్నీ కలిపి వాషింగ్ మెషీన్‍లో వేసేస్తుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మరెలా ఉతకాలి? కలిపి ఉతికితే ఏం అవుతుంది?
టైం వృథా అవ్వకూడదని టవల్స్, బెడ్ షీట్స్, బట్టలు అన్నీ కలిపి వాషింగ్ మెషీన్‍లో వేసేస్తుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మరెలా ఉతకాలి? కలిపి ఉతికితే ఏం అవుతుంది? సాధారణంగా కిచెన్ లేదా బాత్రూమ్ టవల్స్‌ను ఇతర బట్టలతో కలపొద్దని అంటారు. కానీ బెడ్‌షీట్ల విషయానికి వస్తే, కొన్ని సందర్భాల్లో వీటిని బాత్రూమ్ టవల్స్‌తో కలిపి ఉతకవచ్చు.
26
బరువైన టవల్స్‌ను వీటితో కలపొద్దు
బట్టలు ఉతికేటప్పుడు ఒకే రకమైన వాటిని కలిపి ఉతకడం మంచిది. ఉదాహరణకు, మీ బెడ్‌షీట్, టవల్ రెండూ 100% కాటన్ లేదా మైక్రోఫైబర్‌తో తయారైతే, వాటిని కలిపి ఉతకవచ్చు. కానీ సిల్క్ బెడ్‌షీట్లతో బరువైన టవల్స్ వేయకండి.
36
సమస్య ఎక్కడ మొదలవుతుంది?
కాటన్ టవల్స్ ఉతికేటప్పుడు చిన్న చిన్న నూలు పోగులను (Lint) వదులుతాయి. వీటిని సింథటిక్ లేదా పాలిస్టర్ బెడ్‌షీట్లతో కలిపి ఉతికితే, ఆ నూలు పోగులు బెడ్‌షీట్‌కు అంటుకుంటాయి. దీనివల్ల షీట్ మెత్తదనం పోతుంది. అయితే, రెండు బట్టలూ సింథటిక్ అయితే ఈ సమస్య ఉండదు.
టవల్స్ సాధారణంగా మందంగా ఉండి, ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. అందుకే అవి ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీరు పల్చటి బెడ్‌షీట్, మందపాటి టవల్స్‌ను కలిపి డ్రైయర్‌లో వేస్తే, బెడ్‌షీట్ త్వరగా ఆరిపోయి, ఎక్కువ వేడికి పాడవ్వొచ్చు. కానీ టవల్స్ ఇంకా తడిగానే ఉండొచ్చు.
56
రంగు, వేడి
ముదురు రంగు టవల్స్, తెలుపు లేదా లైట్ కలర్ బెడ్‌షీట్లకు వాటి రంగు అంటుకుంటే అవకాశం ఉంది. అలాగే, టవల్స్‌లోని బ్యాక్టీరియాను తొలగించడానికి వేడి నీటిలో ఉతకాలని చెబుతారు. కానీ కొన్ని బెడ్‌షీట్లకు చల్లని లేదా గోరువెచ్చని నీరు అవసరం. అందుకే వీటిని వేరు చేయడమే మంచిది.
66
ఉతికే వ్యవధిలో తేడా
టవల్స్‌ను ప్రతి 3-4 సార్లు వాడిన తర్వాత ఉతకాలి. కానీ బెడ్‌షీట్లను వారానికి ఒకసారి ఉతికితే సరిపోతుంది. ఈ తేడా వల్ల కూడా, శుభ్రత కోసం రెండింటినీ వేర్వేరుగా ఉతకడమే మంచిది.