Bath room Bad Smell: బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తోందా? ఇదొక్కటి పెడితే, ఆ దుర్వాసన రాదు..!

Published : Aug 29, 2026, 04:44 PM IST

Bath room Bad Smell: బాత్రూమ్ నుంచి దర్వాసన రావడం సహజం. దాని కోసం, ఖరీదైన కెమికల్స్ వాడాల్సిన అవసరం లేకుండా.. రూపాయి ఖర్చు కూడా లేకుండా.. ఈజీగా ఆ దుర్వాసన రాకుండా చేయచ్చు. ఇంట్లో బేకింగ్ సోడా ఉంటే చాలు.

PREV
13
Bathroom Bad Smell

మీరు బాత్రూమ్‌ను ఎంత శుభ్రంగా కడిగినా, కొన్నిసార్లు అందులోంచి దుర్వాసన వస్తూనే ఉంటుంది. దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్స్, రూమ్ ఫ్రెష్‌నర్లను కొని డబ్బులు వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో ఉండే బేకింగ్ సోడా తో ఈ సమస్యకు చాలా సింపుల్ గా చెక్ పెట్టేయచ్చు. ముఖ్యంగా టాయిలెట్ కమోడ్ అడుగు భాగంలో పేరుకుపోయే తేమ వల్లే బ్యాక్టీరియా చేరి దుర్వాసన వస్తుంటుంది. బేకింగ్ సోడా ఈ దుర్వాసనను మూలం నుండి ఎలా మాయం చేస్తుందో ఇప్పుడు చూద్దాం…

23
బేకింగ్ సోడా ఎలా పనిచేస్తుంది?

తేమను పీల్చుకుంటుంది: టాయిలెట్ అడుగు భాగంలో బేకింగ్ సోడా చల్లడం వల్ల, అది అక్కడి తేమను పూర్తిగా పీల్చేసి, ఆ ప్రాంతాన్ని పొడిగా ఉంచుతుంది.

దుర్వాసనను తగ్గిస్తుంది: ఇది ఇతర రూమ్ ఫ్రెష్‌నర్లలా వాసనను కప్పిపుచ్చదు. చెడు వాసనకు కారణమయ్యే వాటిని తగ్గించి.. చెడు వాసనను పూర్తిగా తగ్గిస్తుంది. అంతేకాదు.. ఈ బేకింగ్ సోడా చల్లడం వల్ల బాత్రూమ్ నేల పొడిగా మారుతుంది.

సులభమైన శుభ్రత: నేల పొడిగా మారడం వల్ల అక్కడ మురికి, పాచి పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో తుడవడం చాలా తేలికవుతుంది.

33
ఉపయోగించే సరైన పద్ధతి

టాయిలెట్ కమోడ్ అడుగు భాగం చుట్టూ బేకింగ్ సోడాను ఒక పలుచని పొరలా సమానంగా చల్లండి.దాన్ని అలాగే 2 నుండి 3 గంటల పాటు ఉంచండి. వీలైతే రాత్రంతా ఉంచితే మరింత మంచి ఫలితం ఉంటుంది. ఉదయాన్నే ఒక పొడి క్లాత్ లేదా చీపురుతో ఆ పొడిని తుడిచి పక్కకు తీసేయండి. తర్వాత కావాలంటే నీటితో కడిగేయచ్చు. బాత్రూమ్‌లో దుర్వాసన అనిపించినప్పుడల్లా ఈ చిట్కాను పాటించవచ్చు. ఖరీదైన క్లీనర్లు కూడా ఇవ్వలేనంత శుభ్రత, సువాసన ఈ బేకింగ్ సోడా ఇచ్చేస్తుంది.

తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు

గాలి ప్రసరణ: ఈ పని చేసేటప్పుడు బాత్రూమ్ కిటికీ లేదా తలుపు తెరిచి ఉంచడం మంచిది. వీలైతే చేతులకు గ్లవ్స్ (Gloves) ధరించండి. బేకింగ్ సోడా పొడి కళ్లలో లేదా ముఖంపై పడకుండా జాగ్రత్త వహించండి.

Read more Photos on
click me!

Recommended Stories