వాస్తు శాస్త్రం ప్రకారం, బాల్కనీలో వాషింగ్ మెషీన్ ఉంచడం పూర్తిగా తప్పు కాదు. కానీ, మీ బాల్కనీ ఏ దిశలో ఉందనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. వాషింగ్ మెషిన్ నీరు,కరెంట్ సహాయంతో నడుస్తుంది. కాబట్టి.. సరైన దిశలో ఉంచకపోతే.. ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీపై ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి.. ఏ దిశలో ఉంచాలో ఇప్పుడు చూద్దాం...
తూర్పు, ఉత్తరం బాల్కనీ...
ఈ రెండు దిక్కుల్లో వాషింగ్ మెషిన్ ఉంచడం మంచిది కాదు. ఉత్తరం, తూర్పు దిశలను ఇంటిలో అత్యంత పవిత్రమైన మూలాలుగా భావిస్తారు. ఇక్కడి నుండి సానుకూల శక్తి, సూర్యరశ్మి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఈ దిశల్లో వాషింగ్ మెషిన్ ని ఉంచితే... వాషింగ్ మెషీన్ నుంచి వచ్చే మురికి నీరు, శబ్దం పాజిటివ్ ఎనర్జీని దెబ్బతీస్తాయి. దీని వల్ల ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉంది.
వాయువ్య బాల్కనీ...
వాస్తు ప్రకారం, మీ బాల్కనీ వాయువ్య దిశలో ఉంటే, మీ వాషింగ్ మెషీన్ ను అక్కడ ఉంచడం బెస్ట్ ఛాయిస్.
దక్షిణ లేదా పడమర బాల్కనీ...
ఈ బాల్కనీ బరువైన వస్తువులు నిల్వ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అది కూడా బాల్కనీ మధ్యలో కాకుండా.. ఒక మూలలో ఉంచాలి.