ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం ఎంత డేంజరో తెలుసా..?

First Published Sep 10, 2022, 3:57 PM IST

తెల్లవార్లూ ఫోన్ ను యూజ్ చేసి.. పడుకునే ముందు పక్కన పెట్టుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలా పడుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు తెలుసా..? 
 

ఫోన్ చేతిలో లేకుంటే క్షణాన్ని కూడా యుగంలా గడిపే వారు చాలా మందే ఉన్నారు. అందులోనూ ఈ రోజుల్లో ఫోన్ లేని వారు లేరు కదా. ఆన్ లైన్ క్లాసుల పేరిట స్కూల్ పిల్లలు కూడా ఫోన్లను వాడుతున్నారు. ఫోన్ ఒక్కటుంటే చాలు తిండి తిప్పలే కాదు.. ఇంట్లో ఎవరున్నారు.. ఎవరు లేరు అన్న విషయాన్ని కూడా పట్టించుకోనోళ్లు కూడా ఉన్నారు. స్మోర్ట్ ఫోన్  ను అచ్చం చంటిపిల్లాడిలా చూసుకుని పక్కన పెట్టుకుని పడుకునేటోళ్లకు కొదవే లేదు. దీనివల్ల ఎంత  ప్రమాదమో తెలుసా..? 
 

యువకులు 90 శాతం, పెద్దలు 60 శాతం తమ తమ ఫోన్లను పక్కన పెట్టుకునే పడుకుంటున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో వెల్లడైంది. ఇక ఇలాంటి వారు నిద్రలేవగానే వాటినే చూస్తారు. అందులోనూ ఇలాంటి వారు ఉదయం యాక్టీవ్ గా అస్సలు ఉండరట. బాగా అలసిపోయినట్టుగా, మూడీగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ చూడటం వల్ల కూడా ఇలా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

అందులోనూ నిద్రపోయే ముందు ఫోన్ చూడటం వల్ల తొందరగా నిద్రపట్టదు. ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైటే ఇందుకు కారణం. ఈ ఫోన్ వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి, స్థూలకాయం, డిప్రెషన్ వంటి ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ఫోన్ నుంచి ఆరోగ్యాన్ని పాడు చేసే రేడియేషన్ రిలీజ్ అవుతుంది. ఇలాంటి దాన్ని దగ్గరే పెట్టుకుని పడుకోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది. ఈ రేడియేషన్ కండరాల నొప్పిని కలిగించడంతో పాటుగా తలనొప్పి కూడా వస్తుంది. 

అంగస్తంభన లోపానికి ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఫోన్ ను వచ్చే బ్లూ రేస్ నిద్ర రావడానికి సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. దీంతో మీరు నిద్రలేమి సమస్యను ఫేస్ చేయొచ్చు. 

Image: Getty Images

నిద్రపోయే ముందు ఫోన్ వాడటం అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీకు తెలియకుండానే ఎంతో సమయం గడిచిపోతుంది. దీనివల్ల నిద్రుండదు. అలాగే కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదు. ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే పడుకునే ముందు ఫోన్ ను మీకు 3 అడుగుల దూరంలో ఉంచండి. దీని ఎఫెక్ట్ మీపై తక్కువగా పడుతుంది. మరొక ముఖ్యమైన విషయం పడుకునే ముందు  నోటిఫికేషన్లను చూడటం ఆఫ్ చేయండి. మొబైల్ డేటాను ఆఫ్ చేస్తే ఇంకా మంచిది. 

click me!