మీలో ఆ లోపాన్ని... మీ నాలుక పట్టిస్తుంది.. !

First Published Sep 24, 2021, 3:12 PM IST

సాధారణంగా, విటమిన్ డి లోపం రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. అయితే, ఇప్పుడు పరిశోధకులు ఈ లోపాన్ని ట్రాక్ చేయడానికి మరొక సులభమైన మార్గాన్ని కనిపెట్టారు. అదే నాలుక. మీకున్న విటమిన్ డి లోపాన్ని మీ నాలుక సరిగ్గా పట్టిస్తుందట. 

మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అనేక పోషకాలలో విటమిన్ డి ఒకటి.  సూర్యకాంతి నుండి విటమిన్ డి లభిస్తుంది. శరీరం సూర్యకాంతికి ఎక్స్ పోజ్ శరీరంలో ఉత్పత్తి అయ్యే కొవ్వులో కరిగే పోషకం ఇది. ఇది ఆహారం ద్వారా చాలా తక్కువ మొత్తంలో లభిస్తుంది కాబట్టి.. సూర్య కాంతే దీనికి మెయిన్ సోర్స్. 

విటమిన్ డి శరీరంలో అనేక కీలక పాత్రలను పోషిస్తుంది. ఎముకలు, దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే విటమిన్ డి పోషక లోపం శారీరక, మానసిక ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. ఇది ఇంత ఇంపార్టెంట్ అయినా, దీని గురించి తెలిసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కునే సమస్య విటమిన్ డి లోపమే. 

సాధారణంగా, విటమిన్ డి లోపం రక్త పరీక్ష ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. అయితే, ఇప్పుడు పరిశోధకులు ఈ లోపాన్ని ట్రాక్ చేయడానికి మరొక సులభమైన మార్గాన్ని కనిపెట్టారు. అదే నాలుక. మీకున్న విటమిన్ డి లోపాన్ని మీ నాలుక సరిగ్గా పట్టిస్తుందట. 

2017 లో మాయో క్లినిక్, రోచెస్టర్ (USA) డెర్మటాలజీ విభాగం నిర్వహించిన అధ్యయనం ప్రకారం, బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ (BMS) లక్షణాలు ఉన్న వ్యక్తుల్లో ఆహారం ఫాస్టింగ్ లో రక్తంలో గ్లూకోజ్, విటమిన్ D (D2, D3) ,విటమిన్ B6, జింక్, విటమిన్ B1, TSH పరీక్షలు చేయాలి. 

ఈ బర్నింగ్ నొప్పి లేదా వేడి అనుభూతి సాధారణంగా పెదాలు లేదా నాలుక మీద లేదా నోటిలోపల  విస్తృతంగా ఉంటుంది. దీంతో పాటు, ఒక వ్యక్తి నోట్లో తిమ్మిరి, పొడి, అసహ్యకరమైన రుచిని  అనిపించవచ్చు. ఏదైనా తినేటప్పుడు నొప్పి తీవ్రమవుతుంది. సమస్య మూల కారణాన్ని తెలుసుకోకపోతే పరిష్కరించడం కష్టం. అంతేకాదు పరిస్థితి తీవ్రత వ్యక్తికి వ్యక్తికి మారవచ్చు.

కరోనా నేపథ్యంలో విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా పెరిగింది.  విటమిన్ డి తక్కువగా ఉంటే ఇన్ఫ్లమేటరీ సైటోకిన్స్, న్యుమోనియా, వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. 

కాబట్టి, మీరు ఈ లక్షణాన్ని తేలికగా తీసుకోకూడదు. బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ ఇతర పోషకాల లోపం వల్ల కూడా కలిగే అవకాశంఉన్నప్పటికీ...ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి మీరు మీ డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. విటమిన్ డి లోపం ఇతర సాధారణ లక్షణాలు అలసట, ఎముక నొప్పి, కండరాల తిమ్మిరి, మానసిక స్థితిలో మార్పులు.

మీ శరీరానికి అవసరమైన మొత్తంలో విటమిన్ డి కావాలంటే ఎండలో ఎంతసేపు ఉండాలి? అంటే... రోజువారీ విటమిన్ డి ఎంత అవసరం అంటే 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి 600 IU,  70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి 800 IUలు అవసరం.

ప్రతిరోజూ సూర్యకాంతిలో కొంత సమయం గడపడం ద్వారా మీ శరీరం తగినంత మొత్తంలో విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. సూర్యకాంతి తీవ్రత కారణంగా సమయాన్ని బట్టి, సీజన్ ను బట్టి భిన్నంగా ఉంటుంది. ఎలాగంటే వసంత రుతువు, వేసవికాలంలో 10 నుండి 20 నిమిషాలు ఎండలో ఉంటే సరిపోతుంది. ఇదే  చలికాలంలో అయితే  శరీరానికి కావాల్సిన విటమిన్ డి కోసం కనీసం 2 గంటలు ఎండలో ఉండాల్సి ఉంటుంది. 

సూర్యరశ్మి విటమిన్ డికి మంచి వనరు. అయితే దీన్ని కావాల్సిన మొత్తంలో ఎక్కువగా పొందాలంటే.. కొన్ని ఆహారపదార్థాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చాలి. 

పాలకూర
కాలే
ఓక్రా
సోయాబీన్స్
వైట్ బీన్స్
సార్డినెస్
 సాల్మన్ వంటి చేపల్లో కూడా విటమిన్ డి అధికంగా దొరుకుతుంది. 

click me!