చేప
సాక్కీ సాల్మన్, సిర్డినెస్, రెయిన్ బో ట్రౌట్, ట్యూనా వంటి చేపల్లో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. ఇది మన మెదడును, నాడీ కణాలను క్రమబద్దంగా ఉంచడానికి సహాయపడుతుంది. నిజానికి ఈ ఆహారాల్లో విటమిన్ బి12 తో పాటుగా దాదాపు అన్ని రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, భాస్వరం, విటమిన్ ఎ, విటమిన్ బి3, సెలీనియం లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ సీఫుడ్స్ మీకు ఉత్తమ పోషణను అందిస్తాయి.