విటమిన్ బి12 లోపం ఇన్ని సమస్యలకు దారితీస్తుందా..?

First Published Sep 13, 2022, 4:55 PM IST

విటమిన్ డి 12 మన శారీరానికి చాలా అవసరం. ఇది సరిగ్గా ఉంటేనే మన బాడీ సక్రమంగా పనిచేస్తుంది. లేదంటే రక్తహీనత, అలసట, వికారం వంటి ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 
 

vitamin b12

విటమిన్ బి12 శరీర శక్తిని పెంచుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. శారీరక విధులు కూడా సక్రమంగా జరగడానికి సహాయపడతుంది. ఒక వేళ శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే.. బలహీనంగా ఉంటారు. అలసటగా కూడా అనిపిస్తుంది. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే విటమిన్ బి12 లోపాన్ని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఇవి సాధాణంగా వచ్చే అనారోగ్య సమస్యలు లాగే ఉంటాయి. అందుకే దీనిలక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవడం అవసరం. 

vitamin B 12

విటమిన్ బి12 ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీర భాగాలన్నింటికీ ఆక్సిజన్ ను మోసుకెళుతుంది. మీ శరీరంలో విటమిన్ బి12 లేకపోవడం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి ఆగిపోతుంది. అంటే మీ శరీర  భాగాల సక్రమంగా పనిచేయడానికి తగినంత ఆక్సిజన్ అందదన్న మాట. ఎర్రరక్తకణాల సంఖ్యను భర్తీ చేయడానికి మీ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఈ రక్తహీనత శరీరమంతా  అధిక పరిమాణంలో రక్తాన్ని నెట్టడానికి గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. 

బి12 లోపం సంకేతాలు..

విటమిన్ బి12 లోపం వల్ల పాదాలు, చేతుల్లో బలదరింపు, తిమ్మిరి ఉంటుంది. కండరాలు బలహీనంగా మారతాయి. ఒంట్లో శక్తి ఉండదు. అలసట వంటివి విటమిన్ బి 12 సాధారణన సంకేతాలు. దీనివల్ల నడవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఆకలి లేకపోవడం, చిరాకు, వికారం, విరుచనాలు, బరువు తగ్గడం వంటి సంకేతాలు కూడా కనిపిస్తాయి. విటమిన్ బి12 లోపం రక్తహీనత సమస్యను ఫేస్ చేస్తున్నవారికి మృదువైన నాలుక కూడా ఉండవచ్చు. విటమిన్ బి12 లోపం సంకేతాలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోండి. 

బి12 ను కలిగి ఉన్న ఆహారాలు

విటమిన్ బి12 లోపంతో బాధపడేవారు.. తమ రోజు వారి ఆహారంలో కొన్ని ఆహారాలను తప్పక చేర్చుకోవాలి. అప్పుడే ఈ విటమిన్ లోపం పోతుంది. ఇందుకోసం

చేపలు

మాంసం

పాలు

గుడ్లు

జున్ను

తృణధాన్యాలను తీసుకోవాలి.
 

మీ శరీరంలో విటమిన్ బి12 లోపం మరీ తీవ్రంగా ఉంటే.. ఆహారాలను తీసుకున్నా సెట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు మీరు డాక్టర్ ను సంప్రదించి సప్లిమెంట్లను తీసుకోవచ్చు. లేదా ఇంజెక్షన్లను కూడా తీయించుకోవచ్చు. మీ శరీరక విధులకు ఆటంకం కలగకుండా, మీరు ఆరోగ్యంగా ఉండటానికి తక్షణ రోగ నిర్ధారణ, చికిత్స చాలా అవసరం. సకాలంలో చికిత్స తీసుకోవడం వల్ల ఈ విటమిన్ లక్షణాల నుంచి ఉపశమనం పొందుతారు. ఒక వేళ చికిత్స తీసుకోకపోతే.. ఎంతో నష్టాన్ని చవిచూడాల్సి వస్తది. .

click me!