అబ్బాయిలు పొరపాటున కూడా వీటిని తినకూడదు..

First Published Sep 13, 2022, 3:05 PM IST

ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తది. అయితే పురుషులు పొరపాటున కూడా కొన్ని ఆహారాలను తినకూడదు.. తింటే వీరి పని అంతే..!

ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన వాటినే ఎంచుకోవాలి. మనం ఎన్నో రకాల ఆహారాలను తింటాం. కానీ అన్నీ మనకు మంచే చేస్తాయి అనుకోవడం మన పొరపాటే అవుతుంది. ఆడైనా.. మగ అయినా.. ఇంతకు మగవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం పదండి. 
 

సోయాబీన్స్

సోయాలో ఫైటో ఈస్ట్రోజెన్లు ఉంటాయి. ఫైటో ఈస్ట్రోజెన్లు ప్రాథమికంగా మొక్కల నుంచి వచ్చే ఈస్ట్రోజెన్ లాంటి సమ్మేళనాలు. ఇవి పురుషులకు హాని చేస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫైటో ఈస్ట్రోజెన్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. సోయాబీన్స్ ను అతిగా తినడం వల్ల స్పెర్మ్ సాంద్రత కూడా బాగా తగ్గుతుంది. సొసైటీ ఫర్ ఎండోక్రినాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం..  సోయాబీన్ ను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 
 

ట్రాన్స్ ఫ్యాట్

ట్రాన్స్ ఫ్యాట్స్ పురుషులకే కాదు.. మహిళల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, వేయించిన ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ను తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ కూడా బాగా తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నారు. 
 

ప్రాసెస్ చేసిన మాంసాలు

ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.  సలామి, హాట్ డాగ్స్, బేకన్ మొదలైనవి ప్రాసెస్ చేయబడ్డ మాంసాహారాలు. వీటిని తింటే పురుషుల ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది. అలాగే ఈ ప్రాసెస్ చేసిన మాంసాన్ని తింటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అయితే కోడిమాంసం తినడం వల్ల స్మెర్ప్ కౌంట్ తగ్గుతుందని ఎలాంటి అధ్యయనాలు తెలప లేదు. 
 

పురుగుల మందులు వాడని కూరగాయలు, పండ్లులేవనే చెప్పాలి. కానీ పురుగుల మందుల్లో ఉండే రసాయనాలు నాన్ స్టిక్ కుక్ వేర్ లో కూడా ఉంటాయన్న సంగతి మీకు తెలుసా..? ఇకపోతే బిపిఎ కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది ప్యాక్డ్ ఫుడ్, క్యాన్లలో ఉంటుంది.  పురుగు మందుల రసాయనాలు, బిపిఎ జెనోఈస్ట్రోజెన్ల లాగే పనిచేస్తాయి. జెనోఈస్ట్రోజెన్లు ఈస్ట్రోజెన్ ను అనుకరించే రసాయనాలు. సోయాలో కనిపించే ఫైటోఈస్ట్రోజెన్ల మాదిరిగానే, జినోఈస్ట్రోజెన్లు కూడా స్పెర్మ్ కౌంట్ ను ప్రభావితం చేస్తాయి.  
 

కొవ్వు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు

ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు కూడా పురుషుల ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. రోచెస్టర్ యంగ్ మెన్స్ స్టడీ ప్రకారం.. 18–22 సంవత్సరాల వయస్సు గల 189 మంది పురుషుల స్పెర్మ్, డైట్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు. కొవ్వు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులైన పాలు, జున్ను, వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల నాణ్యత లేని స్పెర్మ్, స్పెర్మ్ కౌంట్ తక్కువ వంటి సమస్యలు తలెత్తాయట. కొన్ని ఆవులకు ఇచ్చే స్టెరాయిడ్ల వల్ల కూడా ఈ సమస్య రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

click me!