couple fight
దాంపత్య జీవితం సరిగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ... తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగా రిలేషన్ షిప్స్ అన్నీ సమస్యల్లో పడుతుంటాయి. దాదాపు చాలా మంది దంపతులు... కామన్ గా చేసే తప్పులు ఏంటో ఓసారి చూద్దాం..
1. అతిగా ఆలోచించడం.... చాలా మంది ఈ అతిగా ఆలోచించడం వల్ల చాలా మంది సమస్యలు తెచ్చుకుంటున్నారట. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం... దానిని ఎనలైజ్ చేయడం లాంటివి చేసి... దంపతులు ఒకరిని మరొకరు అపార్థం చేసుకుంటున్నారు. కమ్యూనికేషన్ లో కూడా తేడాలు వస్తున్నాయట.
2.ఇక దంపతులు...యాంక్సైటీ( ఆందోళన) కారణంగా... ఎక్కువగా క్రిటికల్ గా ఉండటం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయట.
3.చాలా మంది దంపతులు ప్రతి విషయానికీ గొడవ పడాలనే చూస్తుంటారు. ఆ గొడవ ఎలా ఆపాలి అని ఆలోచించడం లేదు. దాని వల్ల సమస్య ఎక్కువ అవుతోందట.
4.చాలా మంది దంపతులు... తమ జీవిత భాగస్వామిపై అన్ని విషయాల్లో ఆధారపడిపోతూ ఉంటారు. తాము సొంతంగా చేసే పనులకు కూడా వారి పార్ట్ నర్ పై ఆధారపడటం కూడా సమస్యలకు కారణమౌతుందట.
5.దంపతుల మధ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే... ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. అలా నమ్మకం లేని సమయంలో దంపతుల మధ్య సమస్యలు వస్తుంటాయి. అనుమానాలు ఉంటే... వారి మధ్య సమస్యలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉంటాయి.
6. చాలా మంది దంపతులు చిన్న విషయాలకు కూడా కాంప్రమైజ్ కావడం లేదట. అలా కాంప్రమైజ్్ కాకపోవడం వల్ల కూడా వారి మధ్య సమస్యలు రావడానకి కారణమౌతుంది.
7. ఇక ఏ బంధం సరిగా ఉండాలన్నా... వారి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. కానీ అలా చేయకపోవడం వల్ల దంపతుల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి.