విటమిన్ ఎ లోపం ఎన్ని జబ్బులకు దారితీస్తుందో తెలుసా..?

Published : Jul 24, 2022, 12:56 PM IST

శరీరంలో విటమిన్ లోపిస్తే కళ్లజోడు రావడం ఖాయం అని నిపుణులు చెబుతున్నారు. అయితే క్రమం తప్పకుండా క్యారెట్ల ను తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ అందుతుంది.   

PREV
18
విటమిన్ ఎ లోపం ఎన్ని జబ్బులకు దారితీస్తుందో తెలుసా..?

విటమిన్ సి, విటమిన్  డి లోపిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో అందరికీ తెలుసు. వీటితో పాటుగా విటమిన్ ఎ లోపించినా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విటమిన్ ఎ లోపాన్ని గుర్తించి  సకాలంలో చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. 
 

28

విటమిన్  ఎ లోపం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. 

38

విటమిన్ ఏ లోపం దేనికి దారితీస్తుంది?

శరీరంలో విటమిన్ ఎ లోపం వల్ల దృష్టి సమస్యలు తలెత్తుతాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది. పిల్లల్లో విటమిన్ ఎ లోపిస్తే  బాల్య అంధత్వానికి దారితీయడంతో పాటుగా ఎన్నో రకాల ఇతర రోగాలు, అంటురోగాలు చుట్టుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ప్రాణాలను కూడా తీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విటమిన్ ఎ లోపం పాలిచ్చే తల్లులు, గర్భిణులపై తీవ్రమైన చెడు ప్రభావం చూపిస్తుంది. గర్భిణుల్లో విటమిన్ ఏ లోపించడం వల్ల ప్రసూతి మరణాలు జరగొచ్చు. 

48

విటమిన్ ఏ లోపం లక్షణాలు

విటమిన్ ఏ చర్మణాలను మరమ్మత్తు చేయడంతో పాటుగా కొత్త చర్మ కణాలను పుట్టించడానికి అవసరం. ఇది చర్మ వాపును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అయితే శరీరంలో విటమిన్ ఏ లోపం ఏర్పడితే మీ చర్మం పొడి బారడం, దురద పెట్టడం, స్కేలింగ్ వంటి సమస్యలు కనిపిస్తాయి. విటమిన్ లోపం వల్ల తామర బారిన కూడా పడతారు. ఇది చర్మ వాపునకు దారితీస్తుంది. చర్మంపై దద్దుర్లు, దురద, పొలుసులుగా మారడం, పుండ్లు, వాపు, గడ్డలు, బొబ్బలు వంటివి విటమిన్ ఏ లోపం లక్షణాలు.

58

విటమిన్ ఎ లోపం ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది

విటమిన్ ఎ లోపం ప్రమాదం ఎక్కువగా గర్భిణులు, పిల్లలకే ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని రకాల అనారోగ్య కరమైన పరిస్థితులు దీనికి దారితీస్తాయి. దీంతో వీరికి విటమిన్ ఎ లోపం ఏర్పడవచ్చు. జీర్ణశయాంతర వ్యవస్థకు సంబంధించిన వ్యాధులే దీనికి కారణమవుతాయి. వీటివల్ల విటమిన్ ఎ ఆహారాలను ఎక్కువగా తీసుకున్నప్పటికీ  విటమిన్ ఎ శోషణకు అడ్డంకిలా మారుతాయి. సిర్రోసిస్, విరేచనాలు, ఉదరకుహర వ్యాధి, ప్యాంక్రియాటిక్ లోపం, పైత్యరస వాహిక రుగ్మత వంటి సమస్యలున్న వారిలో విటమిన్ ఎ లోపం ఎక్కువగా ఉంటుంది. 
 

68

ఆగ్నేయాసియాలో, ఆఫ్రికాలోని పిల్లల్లో ఈ విటమిన్ ఎ లోపం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు తీసుకునే ఫుడ్ లో కెరోటినాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉండవు. 

78

విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలు 

గుమ్మడి కాయ, స్క్వాష్, చిలగడదుంప, నారింజ, బచ్చలి కూర, పాలకూర, కొన్ని రకాల మామిడి పండ్లు, బొప్పాయి. ఆప్రికాట్లు, పాలు, చీజ్, పుచ్చకాయ. కాంటాలౌస్ వంటి ఆహారాల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. 

88

విటమిన్ ఎ లోపం తీవ్రమైన సంకేతాలు

విటమిన్ ఎ లోపం తీవ్రమైన సంకేతాలలో నైట్ బ్లైండ్ నెస్ ఒకటి. దీనివల్ల తక్కువ వెలుతురులో మొత్తమే చూడలేరు. అంటే రాత్రి పూట పూర్తిగా ఏ వస్తువులను చూడలేరు. ఇది రాత్రిపూట పూర్తి అంధత్వానికి దారితీస్తుంది. కళ్లు కూడా డ్రైగా మారతాయి. ఇది  రెటీనాను, కార్నియాను దెబ్బతీస్తుంది. అస్పష్టమైన దృష్టి కూడా విటమిన్ ఎ లోపానికి సంకేతం. ముఖ్యంగా పిల్లల్లో విటమిన్ ఎ లోపిస్తే వారి శరీర ఎదుగుదల  సరిగ్గా ఉండదు.  
 

Read more Photos on
click me!

Recommended Stories