అందమైన ముఖం కోసం శెనగ పిండి ఫేస్ ప్యాక్.. ఎలా తయారుచేయాలంటే

Published : Jul 24, 2022, 10:49 AM IST

Besan Face Packs:  శెనగ పిండితో ముఖంపై ఉండే మొటిమలను, నల్లని మచ్చలను సులువుగా తొలగించుకోవచ్చు. అంతేకాదు ఈ పిండి ముఖాన్ని అందంగా, కాంతివంతంగా తయారుచేస్తుంది కూడా.

PREV
15
 అందమైన ముఖం కోసం శెనగ పిండి ఫేస్ ప్యాక్.. ఎలా తయారుచేయాలంటే
besan

చర్మ సంరక్షణ కోసం శెనగ పిండిని ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. గ్రాము పిండితో ముఖంపై ఉండే మొటిమలను సులువుగా పోగొట్టొచ్చు. శెనగ పిండి ఫేస్ ప్యాక్ తో చర్మం రంగు కూడా మారుతుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి డెండ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి. ముడతలను కూడా తగ్గిస్తాయి. ఈ శెనగ పిండి ఫేస్ ప్యాక్ ఎలాంటి చర్మాన్ని కలిగున్నవారికైనా మంచి మేలు చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

25

మెరిసే చర్మం కోసం.. మూడు టేబుల్ స్పూన్ల శెనగ పిండిని తీసుకుని అందులో అర టీస్పూన్ పసుపుని వేసి, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడిగేస్తే.. మీ ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.

35

జిడ్డు చర్మం ఉన్నవారు శెనగ పిండి ఫేస్ ప్యాక్ ను ఇలా తయారుచేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకుని అందులో టీ స్పూన్ శెనగపిండిని వేసి పేస్ట్ లా తయారుచేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఎండిపోయిన తర్వాత చల్లని నీళ్లతో శుభ్రంగా కడగండి. దీనివల్ల చర్మంపై ఉండే ఎక్స్ ట్రా ఆయిలీ స్కిన్ మటుమాయం అవుతుంది. 
 

45

గుడ్డులోని తెల్లసొన

పొడిబారిన చర్మం గలవారికి ఈ ఫేస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం.. గుడ్డులోని తెల్లసొనలో శెనగ పిండిని వేసి పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ డ్రైనెస్ ను పోగొడుతుంది.

55

కలబంద

ఈ ఫ్యాస్ ప్యాక్ ముఖంపై ఉండే నల్లని మచ్చలను పోగొట్టడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నాటుగు టీ స్పూన్ల శెనగ పిండిని తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల  కలబంద గుజ్జును, టీ స్పూన్ రోజ్ వాటర్ ను మిక్స్ చేయాలి. దీన్ని పేస్ట్ లా తయారుచేసుకుని ముఖమంతటా అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు మూడు సార్లు వేసుకుంటే నల్లని మచ్చలు చాలా తొందరగా తొలగిపోతాయి. 

click me!

Recommended Stories