సంచలనంగా మారిన వీడియో.. కీరదోసకు పిచ్చ డిమాండ్‌

First Published | Aug 24, 2024, 5:58 PM IST

అద్భుతాలకు వేదిక ప్రస్తుత సోషల్‌ మీడియా. జనాలకు కంటెంట్‌ నచ్చితే ఇక్కడ రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోవచ్చు. ఓ కుర్రాడు చేసిన వీడియో ఓ దేశంలో కీరదోస కాయలకు డిమాండ్‌ పెరిగేలా చేసిందంటే మీరు నమ్ముతారా..  పదండి.. ఆ వివరాలు తెలుసుకుందాం..
 

కీరదోసకు డిమాండ్

సాధారణంగా వేసవిలో కీరదోస(కుకుంబర్‌) కాయలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. వేడి నుంచి తట్టుకోవడానికి వీటిని ఎక్కువగా తింటారు.  రోడ్ల పక్కన కూడా ఎక్కువగా వీటిని అమ్ముతుంటారు. అంతేకాకుండా ప్రతి రెస్టారెంట్‌లోనూ కీరదోస, క్యారెట్‌, ఉల్లి స్లైడ్‌ ముక్కలను ఇస్తారు. మసాలా ఫుడ్‌ తినడం వల్ల కలిగే వేడిని తగ్గించేందుకు ఈ కీరదోస ముక్కలు ఎక్కువగా ఉపయోగపడతాయి. అందువల్ల మన దేశంలో కీరదోస పంట అన్ని కాలాల్లోనూ పండుతుంది. మన దేశం నుంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి జరుగుతుంది. 
 

కోసంబరి చాలా ఫేమస్

మన దేశంలో కోసంబరి పేరుతో తయరు చేసే సలాడ్‌ చాలా ఫేమస్‌. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో ఈ సలాడ్‌ ప్రత్యేక ఆకర్షణ. పెరుగులో తరిగిన ఉల్లిపాయలు, పొట్లకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి రుచికి సరిపడా ఉప్పు వేస్తే కోసంబరి రెడీ అయిపోతుంది. ఉత్తర భారత దేశంలో ఈ సలాడ్‌ను పండగలలో కూడా తయారు చేసి తింటారు.
 


టిక్ టాక్ స్టార్ సంచలనం..

ఈ సలాడ్‌కు కొత్త రూపాన్ని జోడించాడు ఐస్‌లాండ్‌కు చెందిన ఓ టిక్‌టాక్‌ స్టార్‌. అతని పేరు లోగాన్ మోఫిట్. ఇతను ప్రత్యేక రెసిపీతో కుకుంబర్‌ సలాడ్‌ తయారు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీన్ని ఆసియా ఖండంలోని అనేక దేశాల ప్రజలు వీక్షించారు. దీంతో లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. ముఖ్యంగా ఐస్‌ల్యాండ్‌ ప్రజలు ఈ కుకుంబర్‌ సలాడ్‌ను చాలా ఇష్ట పడ్డారు. ఇది తయారు చేయడానికి వారు మార్కెట్ల వద్ద బారులు తీరారు. దీంతో కొన్ని రోజులకే కీరదోసకు కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశ వ్యాపారులు కీరదోస దొరికే దేశాల నుంచి కాయలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. 
 

లోగాన్ మోఫిట్ రెసిపీ ఇది..

కీరదోసకాయలను ముక్కలు చేయాలి. తర్వాత అందులో సోయాసాస్, నువ్వులు, వెల్లుల్లి, వెనిగర్ వేయాలి. రుచికి తగిన ఉప్పు వేసే సలాడ్ రెడీ. ఈ రెసిపీ చాలా సులభంగా ఉండటం, ఐస్లాండ్ ప్రజలను ఆకర్షించింది. దీంతో కీరదోసకాయలకు డిమాండ్‌ ఏర్పడింది. అదేవిధంగా ఇతర కూరగాయలతోనూ అనేక సలాడ్ వంటకాలను చేసి వీడియోలను సోషల్‌ మీడియాలో లోగాన్ మోఫిట్ పోస్ట్‌ చేశాడు. 
వాటికి కూడా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 

Latest Videos

click me!