ఏం చేస్తే నెల రోజుల్లో బరువు తగ్గుతారో తెలుసా?

First Published | Aug 24, 2024, 11:07 AM IST

బరువు తగ్గడానికి ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నారా?అయినా మీరు బరువు తగ్గడం లేదా? అయితే ఈ చిట్కాలను ఫాలో అయితే నెల రోజుల్లోనే మంచి ఫలితాలను చూస్తారు. 
 

బరువు పెరిగినంత ఈజీగా బరువు తగ్గడం సాధ్యం కాదు. దీనికోసం ఎంతో కష్టపడాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. హెల్తీ ఫుడ్ నే తినాలి. బయటి ఫుడ్ ను అస్సలు తినకూడదు. అయితే కొంతమంది ఇవన్నీ చేసినా ఇంచు బరువు కూడా తగ్గరు. ఇలాంటి వారు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం చాలా సులువుగా బరువు తగ్గుతారు. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

వెచ్చని నీరు : గోరు వెచ్చని నీళ్లను ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే తాగడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ వాటర్ కేలరీలను ఎక్కువగా కరిగించడానికి సహాయపడుతుంది. దీనివల్ల కడుపులోని చెడు కొవ్వులు సులభంగా కరుగుతాయి. దీంతో మీ పొట్ట కరగుతుంది. బరువు కూడా తగ్గుతారు. 

Latest Videos


వ్యాయామం : ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే మీరు ఎన్నో లాభాలను పొందుతారు. వ్యాయామం వల్ల మీరు బరువు తగ్గుతారు. పొట్ట కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మీ బాడీ ఫిట్ గా, హెల్తీగా ఉంటుంది. ఇందుకోసం ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం చేయండి. 

పోషకాహారాలు : బరువు తగ్గాలంటే మీరు బయటి ఫుడ్ ను తినడం మానేయాలి. ముఖ్యంగా ఇంట్లో వండిన హెల్తీ ఫుడ్ ను  మాత్రమే తినాలి. అంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినండి. అంటే రొట్టెలు,  అన్నానికి బదులుగా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. ఇవి కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

హైడ్రేటెడ్‌గా ఉండండి : మన శరీరం ఆరోగ్యంగా ఉండాంటే మీరు ఖచ్చితంగా ప్రతిరోజూ పుష్కలంగా నీళ్లను తాగాలి. నీళ్లు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. చాలా మంది దాహాన్ని ఆకలిగా భావించి తింటుంటారు. ఇది మీ బరువును పెంచుతుంది. కాబట్టి రోజూ నీళ్లను పరిపడా తాగండి. 

మంచి నిద్ర అవసరం : నిద్రకూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ 8 నుంచి  7 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. మంచి నిద్ర కూడా మిమ్మల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

click me!