రాత్రిపూట కుక్కలు ఏడిస్తే ఖచ్చితంగా ఎవరైనా చనిపోతారా?

First Published | Aug 24, 2024, 10:33 AM IST

చాలాసార్లు రాత్రిళ్లు కుక్కలు విపరీతంగా ఏడుస్తుంటాయి. దీన్ని పెద్దలు చెడు శకునంగా భావిస్తారు. కుక్కలు ఏడిస్తే చాలు.. ఎవరు చనిపోతారో అని అంటుంటారు. నిజంగా ఇలా జరుగుతుందా? అసలు కారణమేంటో తెలుసుకుందాం పదండి. 

కుక్కలు

మనలో చాలా మంది ఇళ్ల దగ్గర కుక్కలను పెంచుకుంటుంటారు. కుక్కల్ని విశ్వాసంలో ఏవీ మించలేవు అందుకే చాలా మంది వీటిని ఇష్టంగా ఇంటికి కాపలాగా పెంచుకుంటుంటారు.  అయితే చాలా కుక్కలు రాత్రిపూట ఏడుస్తుంటాయి. ఈ ఏడుపు మంచిది కాదని పెద్దలు అంటుంటారు. రాత్రిపూట కుక్కలు ఏడవడాన్ని చెడు శకునంగా పరిగణిస్తారు.దీనివల్ల ఊర్లో ఎవరో  చనిపోతారని భావిస్తారు. అసలు కుక్క ఏడుపునకు అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కుక్కలు

మన ఇంటి బయట లేదా ఇంటి గుమ్మంలో కుక్క అరిస్తే అది కొన్ని వ్యాధులను సూచిస్తుంది. మీ కుటుంబంలో ఎవరైనా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని నమ్ముతారు. రాత్రిపూట కుక్క ఏడిస్తే అది ఏదో పెద్ద దురదృష్టాన్ని సూచిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే కుక్క ఇంటి బయట ఏడవకూడదంటారు.


కుక్కలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో కొన్ని పనుల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తుంది. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కావొచ్చు. ఏ ఇంటి బయటైనా కుక్క ఏడిస్తే వారు ఏదో చెడు వార్త వినాల్సి వస్తుంది. మీ ఇంటి చుట్టూ ప్రతికూల శక్తి ఉన్నా కూడా కుక్కరు అరుస్తుంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కుక్క

 మీకు తెలుసా? కుక్కలు రాబోయే సహజ సంఘటనలను ముందుగానే గ్రహించగలవని కూడా చెబుతారు. అంటే భూకంపాలు వంటివి. అందుకే కుక్కలు ముందుగానే ఏడవడం ప్రారంభిస్తాయట. కొన్ని నమ్మకాల ప్రకారం.. కుక్కలు తమ చుట్టూ కొన్ని దుష్ట శక్తులు ఉన్నప్పుడు ఎక్కువగా ఏడుస్తాయట. అందుకే ఇంటి చుట్టూ కుక్కలు ఏడిస్తే వాటిని అక్కడి నుంచి తరిమేస్తారు.

Latest Videos

click me!