KBC : అమితాబ్ బచ్చన్ ముందు పదేళ్ల పిల్లవాడు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ పిల్లాడి ప్రవర్తన చూసి, అసలు పిల్లల్ని పెంచే పద్దతి ఇదేనా అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయంపై సింగర్ చిన్మయి స్పందించడం గమనార్హం
కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ షో గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీలో సక్సెస్ అయిన అతి పెద్ద టీవీ షో ఇది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేసిన ఈ షో సూపర్ హిట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తిగా చేసుకోగా.... ప్రస్తుతం సీజన్ 17 నడుస్తోంది. రీసెంట్ గా పదేళ్ల పిల్లాడు ఈ షోలో పాల్గొన్నాడు. అక్కడ ఆ బాబు ప్రవర్తనను సోషల్ మీడియాలో తప్పు పడుతున్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
24
కేబీసీ షోలో పదేళ్ల పిల్లాడు..
గుజరాత్ లోని గాంధీ నగర్ కు చెందిన ఐదో తరగతి విద్యార్థి ఇషిత్ భట్... కౌన్ బనేగా కరోడ్ పతి ( KBC) సీజన్ 17 లో కనిపించాడు. హోస్ట్ గేమ్ మొదలుపెట్టడానికి ముందు, ఆ గేమ్ రూల్స్ చెబుతూ ఉంటారు. అయితే.. ఇక్కడ కూడా అమితాబ్ రూల్స్ చెప్పబోతుంటే... ఆ పిల్లాడు... తనకు గేమ్ రూల్స్ తెలుసు అని... ముందు ప్రశ్న అడగమని అడిగాడు. అలా మాట్లాడేటప్పుడు అమితాబ్ కి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా కూర్చోవడం, మాట్లాడటం లాంటివి చేయడం గమనార్హం. అంతేకాదు... ప్రశ్నలు అడగడం మొదలుపెట్టగానే, ఆప్షన్స్ అడగక ముందే ఆన్సర్లు చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి నాలుగు ప్రశ్నలకు ఆప్షన్స్ చెప్పకుండానే.. సమాధానాలు చెప్పాడు.
34
రామాయణం ప్రశ్నకు సమాధానం చెప్పలేక..
తర్వాత ఐదో ప్రశ్న.. రామాయణం గురించి అడిగే సరికి..ఆన్సర్ చెప్పలేక తడపడ్డాడు. ఆ తర్వాత.. తప్పు సమాధానంతో గేమ్ నుంచి ఔట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. పిల్లాడిని పేరెంట్స్ సరిగా పెంచలేదని చాలా మంది ట్రోల్ చేయడం గమనార్హం. పిల్లలకు ఎన్ని తెలివితేటలు ఉన్నా... పెద్దవారి ముందు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే వేస్ట్ అని చాలా మంది కామెంట్స్ చేశారు.
ఆ పిల్లాడికి పేరెంట్స్ కనీసం మ్యానర్స్ నేర్పించలేదు అనేది ఆ కామెంట్ల సారాంశం. చాలా మంది అసభ్యకరంగా తిడుతూ మరీ.. ఆ బాబు, అతని పేరెంట్స్ ని ట్రోల్ చేయడం గమనార్హం. కాగా.. ఈ విషయంపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు.
‘‘ చిన్న పిల్లాడి ప్రవర్తన సరిగా లేదు అని.. సోషల్ మీడియాలో పెద్దవాళ్లు అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు. దగ్గు మందు తాగి పిల్లలు చనిపోయినప్పుడు మాత్రం ఒక్కరి గొంతు కూడా లేవలేదు. చిన్న పిల్లాడు కాస్త అత్యుత్సాహం చూపిస్తే, ఇంతలా ద్వేషిస్తూ కామెంట్స్ చేస్తారా’’అంటూ చిన్మయి ట్వీట్ చేశారు.