వాస్తు చిట్కాలు
సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికీ కల ఉంటుంది. దీని కోసం ఒక వ్యక్తి తన జీవితాంతం కష్టపడి పని చేస్తాడు. కానీ ఎంత సంపాదించినా డబ్బు కొరత వస్తూనే ఉంటుంది. దీని కోసం చాలా పరిహారాలు, పూజలు చేసినా అభివృద్ధి ఉండదు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం లేదా తలుపునకు ఈ ఒక్క మొక్క వేరు కడితే చాలు. ఇంట్లో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. ముఖ్యంగా డబ్బు కొరత అస్సలు రాదు. ఎందుకంటే ఇంట్లో ప్రధాన తలుపుకు వాస్తు శాస్త్రంలో ముఖ్య స్థానం ఉంది. మీరు ఊహించని విధంగా డబ్బు పెరుగుతుంది. సరే ఇప్పుడు ఆ మొక్క ఏంటో చూద్దాం.
హిందూ మతంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదమని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీని కారణంగానే హిందూ మతాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్కను పెట్టి పూజిస్తారు. తులసి మొక్క మత విశ్వాసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో వాస్తు శాస్త్రం ప్రకారం తులసి వేరును ఇంటి ప్రధాన ద్వారానికి కడితే సంపద పెరుగుతుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులు ఆ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇది కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
ఎలా కట్టాలి?
వాస్తు ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారానికి తులసి వేరును కట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే తులసి మొక్క ఎండిన తర్వాత దాని వేర్లను తీసేయండి. ఇప్పుడు ఒక ఎర్రటి గుడ్డలో తులసి వేరు, ఒక గుప్పెడు బియ్యం వేసి ముడి వేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి దారం సహాయంతో కట్టాలి.
కొన్ని నియమాలు
వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. దీని కోసం మీరు తులసి మొక్కను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను ఎప్పుడూ కోయకూడదని గుర్తుంచుకోండి. ఒకవేళ అవసరమైతే లక్ష్మీదేవికి చప్పట్లు కొట్టి ప్రార్థన చేసిన తర్వాతే వాటిని కోయాలి.