శరీరాన్ని శుద్ధి చేస్తాయి
కేరళ ఆయుర్వేదానికి పుట్టినిల్లు. పంచకర్మ ఒక ముఖ్యమైన చికిత్స. ఇది శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది. పంచకర్మ అంటే అయిదు రకాల చికిత్సలు. వమనం, విరేచనం, బస్తి, నస్యం, రక్తమోక్షణం. ఇవి శరీరాన్ని శుద్ధి చేస్తాయి.
పంచకర్మ కోసం కేరళ ఎందుకు?
కేరళలో పంచకర్మ చికిత్సకు మంచి వాతావరణం ఉంది. ఇక్కడ ఆయుర్వేద కేంద్రాలు చాలా ఉన్నాయి. శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి
కేరళలోని పంచకర్మ చికిత్స ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దీనికోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు, ఆరోగ్య అభిలాషులు వస్తుంటారు. ఇక్కడకు వచ్చి ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటున్నారు.