Money Vastu: ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా? ఈ వారాల్లో పొరపాటున కూడా ఇవ్వకూడదు!

Published : Sep 29, 2026, 04:50 PM IST

Money Vastu: వారంలోని కొన్ని నిర్దిష్ట రోజుల్లో డబ్బులు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం చేయకూడదని వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఏ వారం నాడు డబ్బులు ఇవ్వకూడదు? ఇస్తే ఏమవుతుంది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
ఏ వారం నాడు డబ్బులు ఇవ్వకూడదు?

వాస్తు శాస్త్రంలో డబ్బుకు సంబంధించి చాలా నియమాలు, నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు తీసుకోవాలి? అనే దానిపై చాలా నమ్మకాలు ఉన్నాయి. మంగళవారం, శనివారం అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం చేయకూడదని వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఎందుకు ఆ వారాల్లో డబ్బులు ఇవ్వకూడదు? ఒకవేళ ఇస్తే ఏమవుతుంది వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

24
మంగళవారం ఎందుకు వద్దు?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం అంగారకుడికి (కుజుడు) సంబంధించిన రోజు. కుజుడు వేగం, తీవ్రత, పోరాటానికి ప్రతీక. అందుకే ఈ రోజున కొత్తగా అప్పు తీసుకోవడం లేదా ఇతరులకు అప్పుగా డబ్బులు ఇవ్వడం చేయకూడదని అంటారు. ముఖ్యంగా మంగళవారం తీసుకున్న అప్పు తీర్చడంలో చాలా ఆలస్యం జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే పాత అప్పులు తీర్చడానికి మంగళవారం చాలా మంచి రోజు అని కూడా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంటే మంగళవారం నాడు కొత్తగా డబ్బులు తీసుకోవడం కంటే, తీసుకున్న అప్పును తిరిగి ఇచ్చేయడం మంచిదట.

34
శనివారం ఎందుకు ఇవ్వకూడదు?

శనివారం శని భగవానుడికి సంబంధించిన రోజు. అందుకే ఈ రోజున పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేయడం, అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం లాంటివి చేయకపోవడమే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కొన్ని నమ్మకాల ప్రకారం, శనివారం అప్పు తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించడం కష్టమవుతుందట. అలాగే డబ్బుల విషయంలో ఊహించని అడ్డంకులు వస్తాయట.

44
అమావాస్య నమ్మకాలు

జ్యోతిష్య శాస్త్రంలో డబ్బులు తీసుకోవడానికి, అప్పు ఇవ్వడానికి, అప్పు తీర్చడానికి, పెట్టుబడులు పెట్టడానికి వేర్వేరు ముహూర్తాలు ఉంటాయి. కేవలం వారాలనే కాదు, కొన్ని తిథుల్లో కూడా ఆర్థిక లావాదేవీలు చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా అమావాస్య రోజున డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదట. డబ్బును తొందరపడి ఖర్చు చేయకుండా, ఒక ప్లాన్ ప్రకారం వాడుకోవాలనేదే ఇలాంటి నమ్మకాల వెనుక ఉన్న అసలు ఉద్దేశమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీ ఆర్థిక పరిస్థితి, అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories