Valentines day: వాలెంటైన్స్ రోజు ఇతర రోజుల కంటే మరింత ఆనందంగా ఉండాలనీ, ప్రియురాలు లేదా ప్రియుడు వారికి మరింత దగ్గరవ్వాలని, వారి బంధం మరింత స్ట్రాంగ్ అవ్వాలని లవర్స్ కోరుకుంటారట. అందుకే ఆ రోజుకు అంత ప్రత్యేకత ఉంది. అంతేకాదు.. ఆ రోజునే తమకు ఇష్టమైన వ్యక్తులకు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఎందుకంటే ఆరోజున వారిపై ఉన్న ఇష్టాన్ని చెబితే.. వారిని రిజెక్ట్ చేయలేరనే గట్టి నమ్మకం ఉంటుందట. కాగా ప్రేమ స్వచ్ఛమైనదైతే.. తమ ప్రేమను చెప్పడానికి స్పెషల్ డేస్ రావాల్సిన అవసరమేమీ లేదు.
ఎందుకో తెలుసా.. ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఇది ఏ సమయంలో ఎవ్వరిపై పుడుతుందో చెప్పలేము. అందుకే ఒకరిపై ఉన్న ఇష్టాన్ని ఎప్పుడైనా చెప్పొచ్చు. కానీ ప్రేమికుల రోజునే చాలా మంది తమ లవర్ కు ప్రపోజ్ చేస్తుంటారు. ఎందుకు? ఈ రోజునే ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి అసలు కారణం ఏంటి? దీని వెనకున్న అసలు నిజం ఏమిటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ ప్రేమను వర్ణిస్తారు. మీకు తెలుసా.. ప్రేమలో పడిన ప్రతి ఒక్కరూ కవులుగా మారుతూ.. తెగ కవితలు రాసేస్తూ.. తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రేమికుల రోజు గురించి కొన్ని కథలు చరిత్రలో బాగా పాపులర్ అయ్యాయి.
కీ.శ 270 లో పేరు పొందిన మత గురువు వాలెంటైన్ యువతకు అనేక విషయాల గురించి బోధించేవారట. ప్రేమ అనే ఆయుధంతోనే స్వార్థం, హింస, ద్వేషంపై పోరాడి విజయం సాధించగలదని ఆయన నమ్మేవారు. అంతేకాదు రోమ్ నగరంలో యువతీ యువకుల మధ్యన ప్రేమ పుట్టేందుకు తన వంతు ప్రయత్నం చేసేవారని చరిత్ర చెబుతోంది. అంతేకాదు.. ప్రేమికులకు దగ్గరుండి పెళ్లిళ్లు చేసేవారట.
కాగా ఆ సమయంలో రోమ్ నగరాన్ని పాలిస్తున్న రాజు క్లాడియస్ పెళ్లిళ్లపై నిషేదం విధించే వారని చరిత్ర చెబుతోంది. ఆ రాజు క్రూరంగా ప్రవర్తించేవారట. అంతేకాదు ప్రేమ అన్నా, పెళ్లిళ్లన్నా ఆ రాజుకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదట. తన ముందు ప్రేమ, పెళ్లిళ్లు అన్నవారిని దారుణంగా శిక్షించేవారట. కానీ ఈ సమయంలోనే వాలెంటైన్స్ ప్రేమను, ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తూనే ఉండేవారు.
రోమ్ నగరంలో పెళ్లిళ్లను నిషేధించినప్పటికీ ఆ రాజ్యంలో పెళ్లిళ్ల సంఖ్య పెరిగిపోవడంతో.. రాజు క్లాడియస్ తన రాజ్యంలో అసలేం జరుగుతుందన్న విషయాలపై ఆరా తీశాడు. పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయన్న విషయంపై ఆరా తీయగా దీనికంతటికీ వాలెంటైన్స్ యే అసలు కారణమని రాజు తెలుసుకున్నాడు. వాలెంటైన్స్ ప్రేమ పాఠాలు చెప్పడం, పెళ్లిళ్లను చేయడం వల్ల వాలెంటైన్స్ ను రాజద్రోహం కింద కారాగారంలో బంధించాడు. అంతేకాదు రాజద్రోహం చేశాడన్న ఆరోపణలతో వాలెంటైన్స్ కు ఉరిశిక్షణు అమలు చేశారు.
Valentines Day
ఎంతో మందికి ప్రేమ పాఠాలు భోధించిన వాలెంటైన్స్ కారాగారంలో ఉన్న సమయంలో ఓ జైలర్ కూతిరితో లవ్ లో పడ్డారట. కానీ వాలెంటైన్ ను ఫిబ్రవరి 14 నాడే ఉరిశిక్షను వేశారు. కాగా అతను చనిపోయే ముందు తన లవర్ ను తలచుకుంటూ తనకోసం 'Your Valentine' అనే ప్రేమ లేఖను రాశాడని చరిత్ర చెబుతోంది. అతని లవ్ లెటరే ప్రేమకు నిర్వచనంగా మారిందట.
వాలెంటెన్ చనిపోయిన రోజు అంటే ఫిబ్రవరి 14 వ తేదీనే వాలెంటైన్స్ రోజును జరుపుకుంటూ వస్తున్నారు. కాగా మన దేశంలో 1990 సంవత్సరం నుంచి వాలెంటైన్స్ డేను జరుపుకుంటూ వస్తున్నారు. రానురాను మన దేశంలో కూడా ప్రేమికుల రోజుకు ప్రత్యేకత పెరిగింది. కాగా ఈ రోజుపై అనేక వివాదాలు కూడా వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఈ రోజుకు చాలా మంది వ్యతిరేకిస్తుంటారు.