Vasant Panchami 2022: మాఘ శుద్ధ పంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. ఇది రుతు సంబంధమైన పండుగ కావడంతోనే వసంత పంచమి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. ఈ వసంత పంచమినే మదన పంచమి అని శ్రీ పంచమి, సరస్వతీ జయంతి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. కాగా భారతదేశంలో ఈ పండగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ వసంత పంచమి ఈ సంవత్సరం ఫిబ్రవరి 5 వ తేదీన వచ్చింది. ఆ రోజున చదువుల తల్లి సరస్వతి తల్లిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాదు వసంత రుతు లక్షణాలు మకర సంక్రాంతి పండుగ తర్వాతి నుంచే కనిపిస్తాయి. చెట్లు పూలు పూయడం, చిగురించడం వంటివి ఈ రుతువు ప్రారంభానికి సంకేతాలు. వసంతుడికి వెల్కమ్ పలుకుతూ Nature ఇలా చిగురిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది.
వసంత పంచమి ఎల్లలు లేని ఎన్నో ఆనందాలను మూటగట్టుకుని వస్తుంది. ఆ రోజున తప్పని సరిగా హరి పూజలను నిర్వహిస్తారు. అంతకాదు రంగులు కూడా జల్లుకుంటారు. ముఖ్యంగా రైతన్నలకు కొత్త ధాన్యం వచ్చే రోజులివే. అందుకే ఈ సమయంలోనే కొత్త బియ్యంతో పాయడం చేసి దేవుళ్లకు నైవేధ్యంగా పెడతారు. అంతేకాదు వసంత పంచమి రోజునే చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ రోజున ఆ దేవతను భక్తీ శ్రద్దలతో నిష్టగా పూజిస్తారు. అంతేకాదు ఆ దేవతను సాయం కాలం వరకు ఎంతో నిష్టగా పూజించి ఊరేంగించి నిమజ్జనం కూడా చేస్తారు. కాగా ఈ పండుగను రాజస్థాన్ లో ఘనంగా జరుపుకుంటారు.
ఈ వసంత పంచమి రోజునే రతీదేవిని, కామదేవుడిని, వసంతుడు భక్తులచే పూజలు అందుకుంటారు. ఈ ముగ్గురిని ఒకే రోజున పూజించడం వల్ల జనాల మధ్య ప్రేమాభిమానులు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ పూజ వల్ల జ్ఞానం పెరుగుతుందట. ఈ పండుగ ప్రారంభంతో వాతావరణం శోభాయమానంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులోనూ ఈ రుతువుతోనే కొత్త పంటలు వస్తాయి. అంతేకాదు పశువులకు కూడా గ్రాసం మెండుగా లభిస్తుంది.
ఈ వసంత పంచమినాడే సరస్వతి జయంతి అవడంతో ఈ పండుగ మరింత విశిష్టతను సంతరించుకుంది. అందుకే ఆ రోజున చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా పుస్తకాలను, కలాలను అమ్మవారు సరస్వతి దేవి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. అంతేకాదు చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజున తమ పిల్లలకు సరస్వతీ మాతా దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఎందుకంటే అమ్మవారి దగ్గర అక్షరాభ్యసం చేయించడం వల్ల పిల్లలు జ్ఞానరాశులు అవుతారని పురాణాలు చెబుతున్నారు. అంతేకాదు ఆ దేవిని ఆరాధించడం వల్ల వాక్సుద్ధి కలుగుతుందని పెద్దలు విశ్వసిస్తున్నారు. అలాగే మనపై ఆ అమ్మకారి కరుణ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఆరోజున తెల్లని లేదా పచ్చని వస్త్రాలతో నిష్టగా పూజలుచేస్తే ఆ తల్లి చల్లని చూపులు మనపై ఎప్పుడూ ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాగా ఆ రోజున ఆ తల్లికి చెరకును, అరటిపండ్లను నైవేద్యంగా పెడతారు.