సమంత ఫేవరేట్ స్నాక్.. బరువు తగ్గేందుకు బెస్ట్ ఆప్షన్..!

First Published | Feb 4, 2022, 10:13 AM IST

ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సమంత పీనట్ బటర్ తినడాన్ని ఆస్వాదిస్తున్న వీడియో పోస్టు  చేసింది. తనకు ఈ పీనట్ బటర్ చాలా ఇష్టమని ఆమె పేర్కొనడం గమనార్హం. ఈ పీనట్ బటర్ ఆరోగ్యంతో పాటు.. రుచిని కూడా అందిస్తుందని ఆమె పోస్టులో పేర్కొన్నారు.

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటీమణుల్లో సమంత ముందు వరసలో ఉంటారు. సినిమాల్లోకి అడుగుపెట్టి దశాబ్దాకాలం దాటినా.. ఆమె క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు

samantha

వరస అవకాశాలు అందుకుంటూ.. వరస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. నటిగా తన కథలను ఎంచుకోవడానికి ఆమె ఎంత శ్రద్ధ చూపిస్తారో... ఫిట్నెస్ పై కూడా అంతే ఎక్కువ శ్రద్ద చూపిస్తారు.


samantha

ఆమె తరచుగా జిమ్‌లో వర్కవుట్ చేస్తూ, యోగా చేస్తూ ,సైక్లింగ్, కయాకింగ్, స్కీయింగ్,మరిన్ని వంటి అవుట్‌డోర్ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్న వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆమెకు చెమట పట్టడం ఎంత ముఖ్యమో, ఆరోగ్యకరమైన ఆహారం, తన శరీరానికి సరైన ఆహారాన్ని ఎంచుకోవడం లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.

ఆమె ఎక్కువగా పీనట్ బటర్ తినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.  ఇది రుచికి రుచిగానూ... ఆరోగ్యానికి ఆరోగ్యం ఇవ్వడంతో పాటు.. బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.
 

ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సమంత పీనట్ బటర్ తినడాన్ని ఆస్వాదిస్తున్న వీడియో పోస్టు  చేసింది. తనకు ఈ పీనట్ బటర్ చాలా ఇష్టమని ఆమె పేర్కొనడం గమనార్హం. ఈ పీనట్ బటర్ ఆరోగ్యంతో పాటు.. రుచిని కూడా అందిస్తుందని ఆమె పోస్టులో పేర్కొన్నారు. దానిలో ప్రోటీన్, విటమిన్లు & మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయని ఆమె క్యాప్షన్ లో వివరించారు.

ఈ పీనట్ బటర్ తినడం వల్ల మనకు కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం..


మెగ్నీషియం, పొటాషియం , జింక్‌తో సహా అవసరమైన విటమిన్లు , ఖనిజాలతో పాటు పీనట్ బటర్  ప్రోటీన్ కి  గొప్ప మూలం. దీన్ని మితంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించవచ్చు. అదనంగా, బరువు తగ్గాలని , సన్నగా అవ్వాలని కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
 

పీనట్ బటర్ లో  కేలరీలు అధికంగా ఉన్నప్పటికీ, ఇందులో తగినంత మొత్తంలో ప్రోటీన్, కొవ్వు , ఫైబర్ కూడా ఉంటాయి, ఇవన్నీ సంతృప్తిని మెరుగుపరుస్తాయి .అనారోగ్యకరమైన, ప్రాసెస్ చేసిన ఆహారాలను దూరంగా ఉంచుతాయి.

అధిక-ఫైబర్ ఆహారాలు సాధారణంగా మీ జీర్ణ ఆరోగ్యానికి గొప్పగా ఉంటాయి, మిమ్మల్ని ఎక్కువ కాలం పాటు సంపూర్ణంగా ఉంచుతాయి , జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇది అదనపు కేలరీలను తినకుండా మిమ్మల్ని నియంత్రిస్తుంది, అదే సమయంలో మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది.

పీనట్ బటర్ ఆరోగ్యకరమైనది. ఇది  బరువు తగ్గడానికి అనుకూలమైనది అయినప్పటికీ, ఎంత తింటున్నామనే విషయాన్ని గమనించుకోవాలి. కొన్నిసార్లు, తెలియకుండానే, మీరు దీన్ని ఎక్కువగా తినవచ్చు, ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. 2 టేబుల్ స్పూన్ల  పీనట్ బటర్ లో  200 కేలరీలు ఉంటాయి.
 

Latest Videos

click me!