ఇందుకేనా.. ఆడవాళ్లు తొందరగా బరువు తగ్గరు..

Published : Feb 02, 2023, 10:51 AM IST

బరువు తగ్గడమంత సులువైన విషయం కాదన్న సంగతి ఇప్పటికే చాలా మందికి తెలిసి ఉంటుంది. బరువు పెరగడం వల్ల గుండెపోటుతో పాటుగా అధిక రక్తపోటు, ఊబకాయం వంటి ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే బరువును తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇక అసలు విషయానికొస్తే.. పురుషులతో పోలిస్తే ఆడవారు అంత సులువుగా బరువు తగ్గరట. ఎందుకంటే?  

PREV
15
ఇందుకేనా.. ఆడవాళ్లు తొందరగా బరువు తగ్గరు..

స్వభావరీత్యా మహిళలు పురుషుల కంటే తక్కువ జీవక్రియ రేటును కలిగి ఉంటారు. శ్వాస, రక్త ప్రసరణ, ఆలోచన వంటి సాధారణ శరీర విధులకు వీరి శరీరం తక్కువ కేలరీలను ఉపయోగిస్తుందని దీని అర్థం. మిగిలిపోయిన కేలరీలు కొవ్వుగా శరీరంలో నిల్వ చేయబడతాయి. అంతేకాక స్త్రీ శరీర కూర్పు మగవారితో పోల్చితే డిఫరెంట్ గా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే.. పురుషుల్లో కొవ్వు కంటే కండరాలే ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటిని వల్ల పురుషులు సులువుగా బరువు తగ్గినా.. ఆడవారు మాత్రం కేలరీలను ఎక్కువగా తగ్గించలేకపోతారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఆడవారు బరువు తగ్గడం కష్టం కావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

25
weightloss

మహిళలు ఎక్కువ కొవ్వును కలిగి ఉంటారు

మహిళలు సహజంగా తమ శరీరంలో పురుషుల కంటే ఎక్కువ కొవ్వును కలిగి ఉంటారు. ఇది వీరి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. అదే పురుషులు ఎక్కువ కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటారు.  కండరాలు జీవక్రియ రేటును పెంచుతాయి. కండరాలు ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తాయి. ఆడవారిలో కంటే మగవారిలో జీవక్రియ 3-10% వేగంగా పనిచేస్తుంది. దీంతోనే వీరు ఆడవారికంటే ఎక్కువ  బరువు తగ్గుతారు. 

35

రుతువిరతి బరువు తగ్గడం కష్టతరం చేస్తుంది

రుతువిరతి సమయంలో మహిళలు మరిన్ని ఎక్కువ కండరాలు, ఎముక ద్రవ్యరాశిని కోల్పోతారు. దీంతో వీరి శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. పిరుదులు, bum ప్యాడింగ్ తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ బాగా పెరుగుతుంది. స్త్రీ శరీరంలో కూడా ఉండే టెస్టోస్టెరాన్ వంటి పురుష హార్మోన్లు రుతువిరతి తర్వాత మరింత ఆధిపత్యం వహిస్తాయి. దీంతో స్త్రీల  శరీర ఆకారం.. "పియర్" నుంచి "ఆపిల్" కు మారుతుంది.
 

45

తప్పుడు వ్యాయామం

వ్యాయామాలను చేస్తే బరువు తగ్గడం సులువే. వ్యాయామం వల్ల కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. సన్నని కండరాలు ఉన్నవారు ఇతరులతో పోలిస్తే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. పురుషులు వేగంగా బరువు తగ్గడానికి ఇది ఒక కారణమంటున్నారు నిపుణులు. మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ సన్నని కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటారు. ఇది మహిళలతో పోలిస్తే ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి వారికి సహాయపడుతుంది. కండర ద్రవ్యరాశిని పెంచడానికి మహిళలు ఎక్కువ వ్యాయామాలను చేయాలి. 
 

55


పురుషుల కంటే మహిళలు ఎక్కువ చక్కెరను కోరుకుంటారు

భావోద్వేగ ఆహారం కూడా ఆడవారి బరువును మరింత పెంచుతుంది. అవును పురుషులతో పోలిస్తే మహిళలు భావోద్వేగ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. నెలసరి సమయంలో దీనికి ఎక్కువగా గురవుతారు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. ఇది వారి బరువు తగ్గించే లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. పురుషులు మాత్రం తమ డైట్ ప్లాన్ కు ఎక్కువగా కష్టపడి ఉంటారు. ఆహార కోరికలను అదుపులో ఉంచుకుంటారు. 
 
 

Read more Photos on
click me!

Recommended Stories