ఎక్కువ మురికి లేని బట్టలను ఉతకడానికి కూడా ఏసీ నీటిని ఉపయోగించవచ్చు. నీటి కొరత ఉన్నప్పుడు మాత్రమే ఈ నీటిని వాడండి. ఇది బట్టలను శుభ్రం చేస్తుంది. కానీ, మరకలు పడిన లేదా ఎక్కువ మురికి ఉన్న బట్టలను ఇందులో ఉతకడం వల్ల ఉపయోగం ఉండదు.
అయతే ఈ ఏసీ నీటిని వంటకు గానీ, తాగడానికి గానీ ఎప్పుడూ ఉపయోగించవద్దు. నిల్వ ఉంచేటప్పుడు, పాత్రపై మూత పెట్టండి. నీటిని నిల్వ చేసే బకెట్ లేదా ట్యాంక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. లేదంటే అందులో క్రిములు చేరే అవకాశం ఉంది.