ఈ కారణాల వల్లే మూత్రం వాసన వస్తుంది..

Published : Apr 01, 2022, 10:43 AM ISTUpdated : Apr 01, 2022, 10:46 AM IST

నీళ్లు ఎక్కువగా తాగకపోయినా, యూరీనరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్ వల్లో, కాఫీ ఎక్కువగా తాగితే  కూడా మూత్రం వాసన వస్తుంది. మూత్రం వాసన రావడం మీకు హెచ్చరిక లాంటిదనే చెప్పాలి. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. మీరు ప్రమాదంలో పడ్డవారవుతారు జాగ్రత్త.. 

PREV
17
ఈ కారణాల వల్లే మూత్రం వాసన వస్తుంది..

చాలా మంది మూత్రం వాసన వస్తుంటుంది. ఈ విషయాన్ని చెప్పకపోయినా.. ఇది వీరి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. మీరు అనారోగ్య సమస్యలకు గురైనా.. యూరిన్ ఇలా స్మెల్ రావొచ్చు. అయితే యూరిన్ ఏయే కారణాల వల్ల స్మెల్ వస్తుందో తెలుసుకుందాం పదండి. 

27

యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్.. దీన్నే యూటీఐ అంటారు. ఈ ఇన్ ఫెక్షన్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్లే మూత్రం వాసన వస్తుంది. అంతేకాదు ఈ యూటీఐ ప్రాబ్లం వల్ల మాటిమాటికీ మూత్రానికి వెల్లాల్సి వకస్తుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలో మంటగా కూడా ఉంటుంది. 

37

నీళ్లు తక్కువగా తాగినా..  మూత్రంలో నీళ్లతో పాటుగా అనేక వ్యర్థాలు కూడా ఉంటాయి. ఇవన్నీ బయటకు పోవాలంటే నీళ్లను ఎక్కువగా తాగాలి. ఒకవేళ నీళ్లను సరిపడా తాగకపోతే మాత్రం యూరిన్ లో వ్యర్థ పదార్థాలు అలాగే ఉండిపోతాయి. దీంతో యూరిన్ వాసన వస్తుంది. 

47

కాఫీ ఎక్కువగా తాగితే కూడా.. కాఫీ తాగిన వారందరికీ యూరిన్ వాసన రాకపోవచ్చు . కానీ కొంతమందికి మాత్రం పక్కాగా వస్తుందట. కాఫీని ఎక్కువగా తాగే వారిలో ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాఫీని ఎక్కువగా తాగితే  బాడీ డీహైడ్రేట్ బారిన పడే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మూత్రం వాసన వస్తుంది. కాబట్టి కాఫీని ఎక్కువగా తాగే అలవాటును మానుకుంటే బెటర్. 

57

డయాబెటిస్ ఉంటే.. యూరిన్ స్మెల్ వస్తే కూడా వారికి డయాబెటీస్ వచ్చినట్టే అంటున్నారు కొందరు నిపుణులు. ఎందుకంటే ఇతరుల లాగ డయాబెటిస్ పేషెంట్ల బాడీ షుగర్ ను  అరిగించుకోలేదు. దీంతో వీరి మూత్రం వాసన రావడమే కాదు.. వీరు తరచుగా మూత్రానికి వెళ్లాల్సి ఉంటుంది కూడా. 

67

ఎస్ టీఐ.. సుఖవ్యాధులు (Sexually Transmitted Diseases) వల్ల కూడా మూత్రం వాసన వస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  

77

కొన్ని రకాల ఆహార పదార్థాలు.. అందరూ ఒకేలా తమ శరీరతత్వాలనుు కలిగి ఉండరు. కొందరికీ కొన్ని రకాల ఆహారాలు పడితే మరికొందరికి పడకపోవచ్చు. అయితే కొంతమంది వెల్లుల్లి, ఆల్కహాల్, ఆస్పరాగస్, ఉల్లి, బ్రసెల్ స్ప్రౌంట్స్ , సాల్మన్ వీటిని తీసుకుంటే కూడా వాసన వస్తుంది. 

click me!

Recommended Stories