
వేసవికాలం వచ్చిందంటే చాలు చిన్నా.. పెద్దా అంటూ తేడా లేకుండా ఐస్ క్రీములను ఇష్టంగా లాగిస్తుంటారు. ఒకటి ఐస్ క్రీం అంటే ఇష్టం.. మరోటి ఈ ఎండల తాపాన్ని తట్టుకునేందుకు ఇలా వేసవిలో వీటిని తినడానికి జనాలు ఎగబడుతుంటారు. రోజుకు నాలుగైదు కూడా తినేసేవాళ్లు కూడా ఉన్నారు. ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు తినాలనిపించినా.. మరీ ఎక్కువగా తింటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐస్ క్రీమ్స్ లో రకరకాల డ్రై ఫ్రూట్స్, చాక్లెట్, చెర్రీస్, పాలను ఉపయోగిస్తారు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. కానీ వీటిని అధికంగా తింటే మాత్రం హెల్త్ ఇష్యూస్ ను ఎదుర్కోకతప్పదు. ఐస్ క్రీం లను ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసుకుందాం పదండి.
పలు అధ్యయనాల ప్రకారం.. ఐస్ క్రీం లల్లో కొవ్వులు, చక్కెర, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన హెల్త్ కు ఏ మాత్రం మంచివి కావు. వీటివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశముందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
రోజుకు మూడు నాలుగు ఐస్ క్రీమ్ లు తింట మీ శరీరంలోకి వెయ్యికి పైనే కేలరీలు చేరుతాయి. దీంతో మీ శరీర బరువు పెరుగుతారు. అవసరానికి మించి శరీరంలో కేలరీలు చేరితే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.
ఐస్ క్రీమ్ లు ఎక్కువగా తింటే బాడీలో కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఓవర్ వెయిట్, అధిక రక్తపోటు సమస్యలున్న వారు ఐస్ క్రీమ్ లను తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది.
అధిక చక్కెరలు. కొవ్వులను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మెమోరీ పవర్ తగ్గిపోయే అవకాశముందని పలు నివేధికలు స్పష్టం చేస్తుంది.
షుగర్ పేషెంట్లు ఐస్ క్రీమ్ ను తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు ఐస్ క్రీమ్ లను చాలా తక్కువగా తినాలి.
ఐస్ క్రీమ్ లల్లో కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి అంత తొందరగా అరగవు. దీంతో అజీర్థి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల మూలంగా రాత్రుళ్లు నిద్రకూడా ఉండదు.
ఐస్ క్రీం తింటే కలిగే లాభాలు.. ఈ ఎండాకాలం ఐస్ క్రీమ్ లను తింటే శరీర ఉష్ణోగ్రత తగ్గి హాయిగా ఉంటుంది. అంతేకాదు వీటిలో ఉండే చాక్లెట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా.
ఐస్ క్రీం లో ఉండే చెర్రీస్, పాలు, డ్రై ఫ్రూట్స్ వల్ల మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. పాలలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ డి, కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
ఐస్ క్రీం తింటే ఒత్తిడి ఇట్టే తగ్గుతుంది. మనసుకు ఆనందం కూడా కలుగుతుంది. వీటిని తిన్న వెంటనే చిరాగ్గా ఉన్న మూడ్ మల్లీ నార్మల్ అవుతుంది.
అల్సర్ వంటి సమస్యలతో బాధపడేవారు ఐస్ క్రీం ను తింటే నొప్పి, మంట సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలా అని ఓవర్ గా మాత్రం తినకూడదు.